40% తగ్గిన విమాన ప్రయాణికులు

కరోనా మహమ్మారి ప్రభావం విమాన ప్రయాణాలపై ఇంకా కొనసాగుతోంది. దేశీయ విమాన ప్రయాణాలు గత జనవరిలో 40 శాతం మేర తగ్గి 77.34 లక్షలకు పరిమితమయ్యాయని పౌర

Published : 19 Feb 2021 01:20 IST

జనవరిలో 77.34 లక్షలే: డీజీసీఏ

ముంబయి: కరోనా మహమ్మారి ప్రభావం విమాన ప్రయాణాలపై ఇంకా కొనసాగుతోంది. దేశీయ విమాన ప్రయాణాలు గత జనవరిలో 40 శాతం మేర తగ్గి 77.34 లక్షలకు పరిమితమయ్యాయని పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌(డీజీసీఏ) వెల్లడించింది. కాగా 2020 జనవరిలో 1.27 కోట్ల ప్రయాణికులు దేశీయ మార్గాల్లో ప్రయాణించినట్లు పేర్కొంది. ఇండిగో, స్పైస్‌జెట్‌, ఎయిరిండియా, గోఎయిర్‌, విస్తారా, ఎయిరేషియా ఇండియాల్లో ప్రయాణికుల భర్తీ సామర్థ్యం (లోడ్‌ ఫ్యాక్టర్‌) 70-64.9 శాతం మధ్య నమోదైంది. ఇండిగో 54.30 శాతం మార్కెట్‌ వాటాతో 42.03 లక్షల మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరవేసింది. దీని తరవాత విస్తారా 12.8 శాతం వాటాతో 9.92 లక్షల మందిని చేరవేసింది. దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌ విమానాశ్రయాల నుంచి బయలుదేరే లేదా చేరుకునే ఇండిగో విమానాలు 93.7 శాతం కచ్చిత సమయానికి నడిచాయని డీజీసీఏ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు