ఎంఎఫ్‌ పంపిణీదార్ల ఏఆర్‌ఎన్‌ నమోదు, పునరుద్ధరణ రుసుములు 50% తగ్గింపు: యాంఫీ

ఈ నెల 1 నుంచి మ్యూచువల్‌ ఫండ్‌ పంపిణీదార్లకు ఏఆర్‌ఎన్‌ (యాంఫీ రిజిస్ట్రేషన్‌ నంబర్‌) నమోదు, పునరుద్ధరణ (రెన్యువల్‌) రుసుముల్ని 50 శాతం మేర తగ్గిస్తున్నట్లు మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ సమాఖ్య యాంఫీ వెల్లడించింది.

Published : 01 May 2021 01:34 IST

దిల్లీ: ఈ నెల 1 నుంచి మ్యూచువల్‌ ఫండ్‌ పంపిణీదార్లకు ఏఆర్‌ఎన్‌ (యాంఫీ రిజిస్ట్రేషన్‌ నంబర్‌) నమోదు, పునరుద్ధరణ (రెన్యువల్‌) రుసుముల్ని 50 శాతం మేర తగ్గిస్తున్నట్లు మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ సమాఖ్య యాంఫీ వెల్లడించింది. ఉద్యోగుల ఈయూఐఎన్‌ (ఎంప్లాయీ యునీక్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌) నమోదు, రెన్యూవల్‌ ఫీజును కూడా రూ.1,500, రూ.750 నుంచి రూ.500కు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఏఆర్‌ఎన్‌, ఈయూఐఎన్‌ నమోదు, పునరుద్ధరణ ఫీజుల తగ్గింపుతో కొత్త వారిని, యువతరాన్ని ప్రోత్సహించినట్లు అవుతుందని పేర్కొంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లోని చిన్న మదుపర్లను సైతం మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయించేందుకు తోడ్పాటు అందించినట్లు అవుతుందని యాంఫీ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని