Air bags: వచ్చే ఏడాది నుంచి 6 ఎయిర్‌బ్యాగులు తప్పనిసరి: గడ్కరీ

వాహనదారుల భద్రతే లక్ష్యంగా వచ్చే ఏడాది అక్టోబర్‌ 1 నుంచి అన్ని కార్లలో ఆరు ఎయిర్‌(Car Airbags) బ్యాగులను కేంద్రం తప్పనిసరి చేసింది......

Updated : 29 Sep 2022 16:03 IST

దిల్లీ: వాహనదారుల భద్రతే లక్ష్యంగా వచ్చే ఏడాది అక్టోబర్‌ 1 నుంచి అన్ని కార్లలో ఆరు ఎయిర్‌(Car Airbags) బ్యాగులను కేంద్రం తప్పనిసరి చేసింది. కంపెనీలన్నీ విధిగా ఆ తేదీ నుంచి కార్లలో 6 ఎయిర్‌బ్యాగులు ఏర్పాటుచేయాల్సి ఉంటుందని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ట్విటర్‌లో వెల్లడించారు. తొలుత ఈ ఏడాది అక్టోబర్‌ 1 నుంచే దీన్ని అమలు చేసేందుకు కసరత్తు చేసిన కేంద్రం.. తాజా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఏడాదికి వాయిదా వేసింది.

అక్టోబర్ 1 నుంచి అన్ని కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగులను (నాలుగు సీట్లతో సహా రెండు సైడ్ ఎయిర్‌ బ్యాగ్‌లు) ఏర్పాటు చేయాలని ఈ ఏడాది జనవరిలో కేంద్రం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే, సరఫరాలో పరిమితులతో ఆటో ఇండస్ట్రీ ఎదుర్కొంటొన్న ఇబ్బందులు, స్థూల ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రయాణికుల కార్లలో (M-1 కేటగిరీ) కనీసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేసే ప్రతిపాదనను 2023 అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్టు గడ్కరీ తెలిపారు. ధర, వేరియంట్లతో సంబంధం లేకుండా ఎయిర్‌బ్యాగులను అమలు చేయాలని, మోటారు వాహనాల్లో ప్రయాణించే వారి భద్రతే తమకు ప్రాధాన్యమని మంత్రి పేర్కొన్నారు.


Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts