ఎన్‌బీఎఫ్‌సీల నిర్వహణలోని ఆస్తుల్లో 7-9 శాతం వృద్ధి

వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో బ్యాంకింగేత ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) 7-9 శాతం వృద్ధి చెందొచ్చని ఇక్రా రేటింగ్స్‌ అంచనా వేసింది. అయితే స్థిరమైన వృద్ధి కోసం నిధుల

Published : 07 Jan 2021 00:38 IST

 వచ్చే ఆర్థిక సంవత్సరంపై ఇక్రా అంచనా

ముంబయి: వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో బ్యాంకింగేత ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) 7-9 శాతం వృద్ధి చెందొచ్చని ఇక్రా రేటింగ్స్‌ అంచనా వేసింది. అయితే స్థిరమైన వృద్ధి కోసం నిధుల సమీకరణ ఈ సంస్థలకు చాలా కీలకమని పేర్కొంది. ఎన్‌బీఎఫ్‌సీలకు అదనంగా దాదాపు రూ.1.9- 2.2 లక్షల కోట్లు అవసరమని అభిప్రాయపడింది. 60 బ్యాంకింగేతర సంస్థలను ఇక్రా సర్వే చేసింది. 2016 మార్చి నుంచి 2020 మార్చి మధ్య ఎన్‌బీఎఫ్‌సీల ఏయూఎం 16 శాతం వార్షిక సమ్మిళిత వృద్ధి రేటును నమోదుచేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే వచ్చే ఆర్థికంలో అన్ని కీలక విభాగాల్లో గిరాకీ పెరగొచ్చని, ఇది వృద్ధిని నడిపిస్తుందని ఇక్రా వైస్‌ ప్రెసిడెంట్‌, సెక్టర్‌ హెడ్‌ (ఫైనాన్షియల్‌ సెక్టర్‌ రేటింగ్స్‌) ఏఎం కార్తీక్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని