ఏప్రిల్‌లో 75 లక్షల ఉద్యోగాలు గల్లంతు
దేశంలో కొవిడ్-19 రెండో దఫా నియంత్రణకు విధించిన లాక్డౌన్లతో ఏప్రిల్‌లో 75 లక్షలకు పైగా ఉద్యోగాలు గల్లంతయ్యాయని, దీంతో నిరుద్యోగ రేటు నాలుగు నెలల గరిష్ఠమైన 8 శాతానికి చేరిందని సెంటర్
సీఎంఐఈ ఎండీ మహేశ్ వ్యాస్
ముంబయి: దేశంలో కొవిడ్-19 రెండో దఫా నియంత్రణకు విధించిన లాక్డౌన్లతో ఏప్రిల్‌లో 75 లక్షలకు పైగా ఉద్యోగాలు గల్లంతయ్యాయని, దీంతో నిరుద్యోగ రేటు నాలుగు నెలల గరిష్ఠమైన 8 శాతానికి చేరిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) పేర్కొంది. సమీపకాలంలో ఉద్యోగాల పరంగా సవాళ్లు కొనసాగే అవకాశం ఉందని సీఎంఐఈ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మహేశ్ వ్యాస్ వెల్లడించారు. సీఎంఐఈ ప్రాథమిక గణాంకాల ప్రకారం.. దేశ నిరుద్యోగ రేటు 7.97 శాతానికి చేరింది. పట్టణ ప్రాంతాల్లో 9.78 శాతంగా, గ్రామీణ ప్రాంతాల్లో 7.13 శాతంగా నమోదైంది. మార్చిలో నిరుద్యోగ రేటు 6.50 శాతంగా ఉంది.
8 నెలల కనిష్ఠానికి తయారీ
దిల్లీ: ఏప్రిల్ నెలలో భారత తయారీ రంగ కార్యకలాపాల వృద్ధిలో పెద్దగా మార్పు కనిపించలేదు. కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి విషయంలో వృద్ధి లేకపోవడంతో ఎనిమిది నెలల కనిష్ఠానికి చేరినట్లు నెలవారీ సర్వే వివరాలు చెబుతున్నాయి. ఏప్రిల్‌లో ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎమ్ఐ) 55.5గా నిలిచింది. మార్చిలో ఇది 55.4గా ఉంది. పీఎమ్ఐ అనేది 50కి పైన ఉంటే వృద్ధిగా.. దిగువకు చేరితే క్షీణతగా పరిగణిస్తారన్న సంగతి తెలిసిందే. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే డీలా పడిన కంపెనీల ఆర్థిక ఫలితాలపై.. క్షీణిస్తున్న గిరాకీ మరింత ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు అంటున్నారు. కాగా, కొత్త ఎగుమతి ఆర్డర్లు మాత్రం వరుసగా ఎనిమిదో నెలా పెరగడం విశేషం. భారత వస్తువులకు అంతర్జాతీయంగా గిరాకీ పుంజుకోవడం ఇందుకు కారణంగా చెప్పవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం