ఏప్రిల్‌లో 75 లక్షల ఉద్యోగాలు గల్లంతు

దేశంలో కొవిడ్‌-19 రెండో దఫా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌లతో ఏప్రిల్‌లో 75 లక్షలకు పైగా ఉద్యోగాలు గల్లంతయ్యాయని,

Updated : 04 May 2021 10:27 IST

 సీఎంఐఈ ఎండీ మహేశ్‌ వ్యాస్‌

ముంబయి: దేశంలో కొవిడ్‌-19 రెండో దఫా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌లతో ఏప్రిల్‌లో 75 లక్షలకు పైగా ఉద్యోగాలు గల్లంతయ్యాయని, దీంతో నిరుద్యోగ రేటు నాలుగు నెలల గరిష్ఠమైన 8 శాతానికి చేరిందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) పేర్కొంది. సమీపకాలంలో ఉద్యోగాల పరంగా సవాళ్లు కొనసాగే అవకాశం ఉందని సీఎంఐఈ మేనేజింగ్‌ డైరెక్టర్, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మహేశ్‌ వ్యాస్‌ వెల్లడించారు. సీఎంఐఈ ప్రాథమిక గణాంకాల ప్రకారం.. దేశ నిరుద్యోగ రేటు 7.97 శాతానికి చేరింది. పట్టణ ప్రాంతాల్లో 9.78 శాతంగా, గ్రామీణ ప్రాంతాల్లో 7.13 శాతంగా నమోదైంది. మార్చిలో నిరుద్యోగ రేటు 6.50 శాతంగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని