Job cuts: కోతల కాలమ్‌: ప్రపంచవ్యాప్తంగా 1.37 లక్షల ఉద్యోగులు ఔట్‌!

ఈ ఒక్క ఏడాదే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 853 టెక్‌ కంపెనీలు 1.37 లక్షల మంది ఉద్యోగుల్ని నేటి వరకు తొలగించాయట. దీనికి మాంద్యం భయాలే కారణమని చెబుతున్నారు.

Published : 25 Nov 2022 18:43 IST

దిల్లీ: నిన్న మొన్నటి వరకు కొవిడ్‌ నామస్మరణ చేసిన కంపెనీలు.. ఇప్పుడు మాంద్యం జపం చేస్తున్నాయి. కారణమేదైనా ఉద్యోగాల కోత కామన్‌ అన్నట్లు తయారైంది పరిస్థితి. మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో ఉద్యోగాల తొలగింపు పదం తరచూ వినిపిస్తోంది. అమెరికా టెక్‌ కంపెనీలు మెటా, ట్విటర్‌, గూగుల్‌ వంటివి ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇవే కాదు ఈ ఒక్క ఏడాదే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 853 టెక్‌ కంపెనీలు 1.37 లక్షల మంది ఉద్యోగుల్ని తొలగించాయట. దీనికి మాంద్యం భయాలే కారణమని చెబుతున్నారు.

క్రౌడ్‌సోర్స్‌ డేటాబేస్‌ ఆధారంగా layoffs.fyi రూపొందించిన నివేదిక ప్రకారం.. కొవిడ్‌-19 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మొత్తం 1388 టెక్‌ కంపెనీలు 2.33 లక్షల మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించాయని తెలిసింది. ఒక్క నవంబర్‌ నెలలోనే అమెరికాకు చెందిన టెక్‌ కంపెనీలు 73 వేల మందిని ఇంటికి పంపించాయిని నివేదిక పేర్కొంది. ఇందులో మెటా, ట్విటర్‌, సేల్స్‌ ఫోర్స్‌, నెట్‌ఫ్లిక్స్‌, సిస్కో, రోకు వంటి కంపెనీలు ఉన్నాయి. ఇవే కాకుండా అమెజాన్‌, హెచ్‌పీ సైతం పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగిస్తామని ప్రకటించాయి.

ఇక భారత్‌లోనూ 44 స్టార్టప్‌ కంపెనీలు సుమారు 16 వేల మంది ఉద్యోగుల్ని తొలగించాయి. ఇందులో బైజూస్‌, అన్‌ అకాడమీ, వేదాంతు, ఓలా, కార్స్‌23, మీషో, లీడ్‌, ఎంపీఎల్‌ వంటి స్టార్టప్‌లు ఉన్నాయి. వేలాది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు సైతం ఉద్యోగులు కోల్పోయారు. మున్ముందూ ఈ కోత ఉండబోతోందని ఇప్పటికే పెద్ద పెద్ద కంపెనీలు హెచ్చరించాయి. ఏదేమైనా టెక్నాలజీ సెక్టార్‌లో పనిచేస్తున్న వారికి ఈ ఏడాది గడ్డుకాలమనే చెప్పాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని