stock market: లోయర్‌ సర్క్యూట్‌ను తాకిన 875 కంపెనీల షేర్లు..!

నేడు స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బ్లడ్‌బాత్‌ చేశాయి. బాంబే స్టాక్‌ ఎక్స్‌ఛేంజిలో ట్రేడవుతున్న3,844 కంపెనీల షేర్లలో 875 లోయర్‌

Updated : 24 Jan 2022 16:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నేడు స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బ్లడ్‌బాత్‌ చేశాయి. బాంబే స్టాక్‌ ఎక్స్‌ఛేంజిలో ట్రేడవుతున్న3,844 కంపెనీల షేర్లలో 875 లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. ఇవి మొత్తం షేర్లలో 22శాతానికి సమానం. ఈ షేర్లను కొనుగోలు చేసేందుకు బయ్యర్‌ కూడా లేని పరిస్థితి నెలకొంది. స్టాక్‌ ఎక్స్‌ఛేంజి డేటా ఈ విషయాన్ని చెబుతోంది.

భారీగా పతనమైన చిన్న కంపెనీల షేర్లు..

ముఖ్యంగా చిన్న కంపెనీల షేర్ల విలువ ఈ విక్రయాల దెబ్బకు భారీగా పతనమైంది. లోయర్‌ సర్క్యూట్‌ తాకిన మొత్తం 875 కంపెనీల షేర్లలో 694 చిన్న కంపెనీలవే ఉన్నాయి. బీఎస్‌ఈ ఎక్స్‌టీ శ్రేణిలో 333, ఎక్స్‌ శ్రేణిలో 166, టి శ్రేణిలో 141, జెడ్‌ శ్రేణిలో 54 ఉన్నాయి. ప్రతి ఐదు కంపెనీల షేర్లలో ఒకటి లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. అదానీ గ్రీన్‌ ఎనర్జీ, నిహార్‌ షిప్పింగ్‌ మిల్స్‌, జేబీఎం ఆటో, టినాల్ ప్లాట్‌ఫామ్స్‌ వంటి షేర్లు ఉన్నాయి. మరోపక్క 19 స్టాక్స్‌ మాత్రం 10శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకడం విశేషం. వీటిల్లో కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌, గోల్డెన్‌ ఎక్స్‌పోర్ట్స్‌ వంటివి ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని