Dineout: ‘ఈ డిస్కౌంట్లు మా వల్ల కాదు’.. స్విగ్గీ డైనవుట్‌కు రెస్టారెంట్ల గుడ్‌బై!
స్విగ్గీకి చెందిన ప్రముఖ టేబుల్ బుకింగ్ యాప్ డైనవుట్ నుంచి తాము వైదొలుగుతున్నట్లు దాదాపు 900 రెస్టారెంట్లు స్విగ్గీకి సమాచారం ఇచ్చాయని తెలిసింది.
మీరు డైనవుట్ (Dineout) యాప్ వాడుతున్నారా? ఎంచక్కా రెస్టారెంట్‌లో ఫుడ్ తిన్నాక యాప్ ద్వారా డిస్కౌంట్ పోగా మిగిలిన బిల్ పే చేద్దామనుకుంటున్నారా? అయితే ఈసారి మీరు రెస్టారెంట్‌కు వెళ్లేముందు మీ డైనవుట్ యాప్ ఓసారి చెక్ చేసుకోండి. గతంలో వెళ్లినప్పుడు డిస్కౌంట్ వర్తించింది కదాని లిస్ట్ చెక్ చేయకుండా వెళితే మీకు భంగపాటు ఎదురవ్వొచ్చు. భారీ డిస్కౌంట్లు తమ వల్ల కాదంటూ కొన్ని రెస్టారెంట్లు డైనవుట్ నుంచి వైదొలుగుతుండడమే ఇందుక్కారణం.
డిస్కౌంట్ల విషయంలో రెస్టారెంట్లు; స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. స్విగ్గీకి చెందిన ప్రముఖ టేబుల్ బుకింగ్ యాప్ డైనవుట్ నుంచి తాము వైదొలుగుతున్నట్లు దాదాపు 900 రెస్టారెంట్లు స్విగ్గీకి సమాచారం ఇచ్చాయని తెలిసింది. ఇండిగో డెలీ, సోషల్ అండ్ స్మోక్ హౌస్ డెలీ, మామాగోటో, వావ్ మామోస్, చాయోస్, ది బీర్ కేఫ్ తదితర రెస్టారెంట్లు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా రెస్టారెంట్లు త్వరలో జొమాటో తీసుకురాబోయే ‘జొమాటో పే’కు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం.
రెస్టారెంట్లకు వచ్చే కస్టమర్లకు భారీ డిస్కౌంట్లు ఇవ్వాలని స్విగ్గీ డైనవుట్, జొమాటో పే వంటివి ఒత్తిడి తెస్తున్నాయని రెస్టారెంట్లు పేర్కొంటున్నాయి. కొవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వేళ.. తమ ఆదాయానికి ఇవి గండికొడుతున్నాయని పేర్కొంటున్నాయి. అయితే, రెస్టారెంట్లు వాదనను స్విగ్గీ ఓ ప్రకటనలో తోసిపుచ్చింది. ఎంత మేర డిస్కౌంట్ ఇవ్వాలన్నది వారి ఇష్టమేనని ఆ కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ప్రస్తుతం 20 నగరాల్లో 15వేల రెస్టారెంట్లు డైనవుట్‌తో అనుసంధానమై ఉన్నాయని, ఈ సంఖ్య మరింత పెరుగుతోందని చెప్పారు.
బహుళ ఔట్‌లెట్లు కలిగిన 20 బ్రాండ్లు మాత్రమే డైనవుట్ నుంచి ప్రస్తుతం వైదొలిగాయని తెలుస్తోంది. అయితే, మన్ముందు మరిన్ని రెస్టారెంట్లు డైనవుట్ నుంచి వైదొలగనున్నాయని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషనన్ ఆఫ్ ఇండియా (NRAI) పేర్కొంది. టైమ్స్ ఇంటర్నెట్ నుంచి డైనవుట్‌ను స్విగ్గీ ఈ ఏడాది మే నెలలో కొనుగోలు చేసింది. ఏడాదికి కొంత మొత్తం చెల్లించి డైనవుట్ పాస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పాస్ ద్వారా ఎంపిక చేసిన రెస్టారెంట్లలో బిల్లు చెల్లించేటప్పుడు డిస్కౌంట్ పొందొచ్చు. మరోవైపు దేశవ్యాప్తంగా జొమాటో పే పేరిట టేబుల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురావడానికి జొమాటో సన్నాహాలు చేస్తోంది.
-ఇంటర్నెట్ డెస్క్
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
రైళ్లపై రాళ్లేస్తే అయిదేళ్ల శిక్ష.. ద.మ.రైల్వే హెచ్చరిక
-
World News
వీర్యదానంతో 550 మందికి తండ్రైన వైద్యుడు
-
Ts-top-news News
రంగంలోకి కేంద్ర నిఘా సంస్థ.. డేటా లీకేజీ వ్యవహారంలో మలుపులు
-
Crime News
కారుపై ‘పొక్లెయిన్’ పిడుగు!.. ముగ్గురి దుర్మరణం.. ఇద్దరికి తీవ్రగాయాలు
-
Ap-top-news News
పాపికొండల విహారయాత్రకు పచ్చ జెండా
-
Politics News
‘వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేయం’.. ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన వైకాపా కార్యకర్తలు