జెట్‌ ఎయిర్‌వేస్‌ నిర్వహణకు ఏడుగురు సభ్యుల కమిటీ త్వరలో

జెట్‌ ఎయిర్‌వేస్‌ పరిష్కార ప్రణాళిక పూర్తయ్యేంత వరకు రోజువారీ కార్యకలాపాలను ఏడుగురు సభ్యుల పరిశీలక కమిటీ నిర్వహించనుంది.

Published : 27 Jun 2021 01:07 IST

ముంబయి: జెట్‌ ఎయిర్‌వేస్‌ పరిష్కార ప్రణాళిక పూర్తయ్యేంత వరకు రోజువారీ కార్యకలాపాలను ఏడుగురు సభ్యుల పరిశీలక కమిటీ నిర్వహించనుంది. త్వరలోనే ఏర్పాటు కాబోయే ఈ కమిటీలో జలాన్‌ కల్రాక్‌ కన్సార్షియంతో పాటు రుణదాతలకు చెందినవారు సభ్యులుగా ఉంటారు. కన్సార్షియం పరిష్కార ప్రణాళికకు జూన్‌ 22న ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 2019 నుంచి కార్యకలాపాలు రద్దు కావడంతో ఈ సంస్థ కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియ(సీఐఆర్‌పీ)లో కొనసాగుతూ వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు, కంపెనీకి పరిష్కార వృత్తినిపుణుడి(ఆర్‌పీ)గా కొనసాగుతున్న ఆశిష్‌ ఛావ్చారియా బాధ్యతలు జూన్‌ 25, 2021తో ముగిసినట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు శనివారం సమాచారం అందింది. ఆమోదం పొందిన పరిష్కార ప్రణాళికలో భాగంగా ఏడుగురు సభ్యుల పరిశీలక కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో ముగ్గురు కన్సార్షియం నుంచి మరో ముగ్గురు రుణదాతల నుంచి నియమిస్తారు. ఒక స్వతంత్ర దివాలా వృత్తినిపుణుడిని సైతం రుణదాతలు నియమిస్తారు. ఈ కమిటీ పరిష్కార ప్రణాళిక అమలును పర్యవేక్షిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని