ఇ-కేవైసీతో ఎన్‌పీఎస్ ఖాతా తెర‌వ‌వ‌చ్చు

కేవైసీ ధృవీకరణ తరువాత ఎన్‌పీఎస్‌ ఖాతాలను తక్షణమే ప్రారంభించ‌డానికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది

Published : 03 Feb 2021 15:39 IST

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పిఎస్) కింద కొత్త చందాదారులు ఆన్‌లైన్ ఆధార్ ఇ-కెవైసి ప్రక్రియను ఉప‌యోగించుకునేందుకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పిఎఫ్‌ఆర్‌డిఎ)  అనుమతించింది.

ఆన్‌లైన్  కెవైసి నిర్వహించడానికి రెవెన్యూ శాఖ ఇటీవల ఇచ్చిన అనుమతి ఖాతా ప్రారంభ ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది, ఎందుకంటే ఈ ప్రక్రియ చందాదారులకు ఎన్‌పీఎస్ సుల‌భ‌మైన‌ డిజిటల్ స‌దుపాయాన్ని అందిస్తుంది అని పీఎఫ్ఆర్‌డీఏ తెలిపింది. 

గత ఏడాది మేలో, పెన్షన్ ప్లాన్ కింద కొత్త చందాదారులను ఆధార్ ఆధారిత ఆఫ్‌లైన్ కాగిత ర‌హిత కేవైసీ  (మీ కస్టమర్ తెలుసుకోండి) అనుమతించింది. కేవైసీ ధృవీకరణ తరువాత ఎన్‌పీఎస్‌ ఖాతాలను తక్షణమే ప్రారంభించ‌డానికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. 

రిమోట్ ఆన్‌బోర్డింగ్, ఆన్‌లైన్ ఎగ్జిట్ టూల్స్, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి ఆన్‌లైన్ నమోదును సులభతరం చేయడానికి వన్-టైమ్ పాస్‌వర్డ్ (ఓటిపి) ఆధారిత ప్రామాణీకరణ, పేపర్‌లెస్ ఆన్‌బోర్డింగ్, ఇ-సైన్ ఆధారిత ప్రామాణీకరణ, డి రిమిట్, వీడియో కస్టమర్ ఐడెంటిఫికేషన్ వంటి వివిధ డిజిటల్ సేవ‌ల‌ను పిఎఫ్‌ఆర్‌డిఏ అందిస్తోంది.  

సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీలలో ఒకటైన ఎన్ఎస్‌డీఎల్ ఇ-గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఎన్‌పీఎస్‌,  అటల్ పెన్షన్ యోజన కోసం గ్లోబ‌ల్ ఆధార్ యూజ‌ర్‌ ఏజెన్సీగా పనిచేయాలని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని