ఏటీఎం లావాదేవీ ఫెయిల్ అయినా న‌గ‌దు డెబిట్ అయిందా?

ఏటీఎంలో డ‌బ్బు రాలేదు కానీ, ఖాతాలో డెబిట్ అయిందా ఏం ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు. మీ డ‌బ్బు తిరిగి వ‌చ్చే మార్గం ఉంది. ఇటీవ‌ల జ‌రిగిన ఒక సంఘ‌ట‌న గురించి మ‌నం విన్నాం. వంద‌న అనే మ‌హిళ ఏటీఎం కార్డు ద్వారా డ‌బ్బు విత్‌డ్రా చేసుకుర‌మ్మ‌ని త‌న భ‌ర్త‌కు ఏటీఎం కార్డు ఇచ్చి పంపించింది. విత్‌డ్రా చేసిన‌ప్పుడు సాంకేతిక కార‌ణాల వ‌ల‌న..

Published : 16 Dec 2020 18:04 IST

ఏటీఎంలో డ‌బ్బు రాలేదు కానీ, ఖాతాలో డెబిట్ అయిందా ఏం ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు. మీ డ‌బ్బు తిరిగి వ‌చ్చే మార్గం ఉంది. ఇటీవ‌ల జ‌రిగిన ఒక సంఘ‌ట‌న గురించి మ‌నం విన్నాం. వంద‌న అనే మ‌హిళ ఏటీఎం కార్డు ద్వారా డ‌బ్బు విత్‌డ్రా చేసుకుర‌మ్మ‌ని త‌న భ‌ర్త‌కు ఏటీఎం కార్డు ఇచ్చి పంపించింది. విత్‌డ్రా చేసిన‌ప్పుడు సాంకేతిక కార‌ణాల వ‌ల‌న ఏటీఎంలోడ‌బ్బు రాలేదు కానీ, ఖాతాలో డ‌బ్బు డెబిట్ అయింది. దీంతో బ్యాంకుని సంప్ర‌దించ‌గా ఇత‌రుల ఏటీఎం కార్డు ఉప‌యోగించ‌డం బ్యాంకు నిబంధ‌న‌ల ప్ర‌కారం త‌ప్పు అని ఎస్‌బీఐ ఈ ఫిర్యాదును తిర‌స్క‌రించింది. ఇలాంటి సంద‌ర్భాల్లో ఫిర్యాదులు ఇచ్చిన‌ప్ప‌టికీ బ్యాంకులు ఏమి చేయ‌లేవు. అయితే కొన్ని సంద‌ర్భాల్లో మీరు కార్డ్ స్వైప్ చేసిన‌ప్ప‌న‌ప్పుడు ఏటీఎంలో త‌గిన డ‌బ్బు లేక‌పోయినా, కార్డు వివ‌రాలు స‌రిగా ఎంట‌ర్ చేయ‌క‌పోయినా లావాదేవీలు క్యాన్సిల్ అవుతాయి. అయితే కొన్ని సార్లు ఇలా జ‌రిగిన‌ప్పుడు డ‌బ్బు రాదు కానీ, మీ ఖాతాలో డ‌బ్బు డెబిట్ అయిన‌ట్లు మెసేజ్ వ‌స్తుంది.

మ‌రి అప్పుడేం చేయాలి?

ఇందుకు మొద‌టి కార‌ణం ఏటికం మిష‌న్‌లో సాంకేతిక స‌మ‌స్య‌లు త‌లెత్త‌వ‌చ్చు. కొన్ని సంద‌ర్భాల్లో ఏటీఎంలో డ‌బ్బు ఉండ‌దు, కొన్ని సార్లు హ్య‌క‌ర్ల చేతిలో మోస‌పోయే అవ‌కాశం కూడా లేక‌పోలేదు.
సాధార‌ణంగా ఏటీఎంలో ఏదైనా లోపాలుంటే బ్యాంకు దీనిని గ‌మ‌నించి మీ ఖాతాలోకి తిరిగి డ‌బ్బుని క్రెడిట్ చేస్తుంది. అయితే ఇది ఆటోమేటిక్‌గా క్రెడిట్ కాదు. మీరు బ్యాంకును సంప్ర‌దించ‌వ‌ల‌సి ఉంటుంది. అది ఏ విధంగా అంటే …

క‌స్ట‌మ‌ర్ కేర్:

బ్యాంకు కాల్‌సెంట‌ర్‌కు ఫోన్ చేసి స‌మ‌స్య గురించి వివ‌రించ‌వ‌చ్చు. ఇక్క‌డ గుర్తుంచుకోవాల్సిందేంటంటే ట్రాన్సాక్ష‌న్ చేసిన‌ప్పుడు వ‌చ్చే రిఫ‌రెన్స్ నంబ‌ర్‌ను ద‌గ్గ‌ర ఉంచుకోవాలి. వారు అడిగిప్పుడు చెప్ప‌వ‌ల‌సి ఉంటుంది. కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ మీ ఫిర్యాదును స్వీక‌రించి బ్యాంకుకు చేర‌వేస్తారు. బ్యాంకు వెరిఫికేష‌న్ చేసిన త‌ర్వాత మీ ఫిర్యాదు నిజ‌మ‌ని గుర్తిస్తే ఖాతాలోకి 7 రోజుల్లోగా రీఫండ్ చేస్తుంది.

బ్రాంచ్‌కి వెళ్ల‌డం:

క‌స్ట‌మ‌ర్ కేర్ ద్వారా మీ స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోతే మీ బ్యాంకు శాఖ‌ను సంప్ర‌దించ‌వ‌ల‌సి ఉంటుంది. వారు ఫిర్యాదు తీసుకొని మీ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తారు.

అధికారుల‌కు తెలియ‌జేయ‌డం:

బ్యాంకు శాఖ‌ను సంప్ర‌దించిన‌ప్ప‌టికీ మీ డ‌బ్బు రీఫండ్ కాక‌పోతే బ్రాంచ్ మేనేజ‌ర్ వ‌ర‌కు తీసుకెళ్ల‌వ‌చ్చు లేదా బ్యాంక్ వెబ్‌సైట్లో మీరు ఫిర్యాదు దాఖ‌లు చేసే అవ‌కాశం ఉంటుంది.

అంబుడ్స్‌మెన్‌:

ఇన్ని చేసిన త‌ర్వాత కూడా మీ డ‌బ్బు తిరిగి రాక‌పోతే బ్యాంకింగ్ అంబుడ్స్‌మ‌న్‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు. మీ ఫిర్యాదులు ఆర్‌బీఐ వెబ్‌సైట్ ద్వారా వారికి చేర‌వేసే అవ‌కాశం ఉంది. అయితే బ్యాంకుకు ఫిర్యాదు ఇచ్చిన 30 రోజుల్లోగా ఎలాంటి స్పంద‌న లేక‌పోతే లేదా మీ స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోతేనే అంబుడ‌బ్స్‌మ‌న్‌ను సంప్ర‌దించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని