Aadhaar: ఇతర దేశాల్లోనూ ఆధార్‌.. ఉడాయ్‌ సంప్రదింపులు

భారత్‌కు మాత్రమే పరిమితమైన ఆధార్‌ను ప్రపంచవ్యాప్తం చేసేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సన్నాహాలు చేస్తోంది.

Published : 03 Dec 2021 19:49 IST

దిల్లీ: భారత్‌కు మాత్రమే పరిమితమైన ఆధార్‌ను ప్రపంచవ్యాప్తం చేసేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సన్నాహాలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌ ఐడెంటిటీ కోసం వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోందని ఉడాయ్‌ సీఈవో సౌరభ్‌ గార్గ్‌ ఓ సమావేశంలో వెల్లడించారు. ఆయా దేశాలకు అనుగుణంగా ఆధార్‌లో పలు మార్పులు చేసేందుకు ప్రపంచ బ్యాంక్‌, ఐక్యరాజ్యసమితితో చర్చలు జరుగుతున్నాయని అంతకుముందు మరో సమావేశంలో సైతం ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం దేశంలో 99.5 శాతం మంది జనాభా ఆధార్‌ను వినియోగిస్తున్నారని గార్గ్‌ శుక్రవారం వివరించారు. ఆధార్ అథెంటికేషన్‌ ద్వారా రోజుకు 5 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని తెలిపారు. ఆధార్‌లోని భద్రతను మెరుగు పరిచేందుకు క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, బ్లాక్‌ చైన్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ సహకారం తీసుకోనున్నట్లు చెప్పారు. ఆధార్‌ టెక్నాలజీ వినియోగం ద్వారా పేటీఎం, పేటీఎం బ్యాంక్‌ పెద్ద ఎత్తున వినియోగదారులను చేర్చుకోగలిగామని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న పేటీఎం సీఈవో శేఖర్‌ శర్మ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని