ఆర్థికరంగానికి ఆయువు ఆధార్

కొన్నేళ్లుగా ఆర్థిక సేవలను ప్ర‌జ‌లంద‌రికీ అందించే దిశ‌గా ప్ర‌య‌త్నాలు కొన‌సాగున్న‌ప్పటికీ దేశంలో కోట్లాది మంది ప్ర‌జలు స్థిర‌మైన రాబ‌డి లేక ఖరీదైన, అనధికారిక ఆర్థిక సేవలను పొందాల్సి వ‌స్తుంది....

Published : 15 Dec 2020 16:08 IST

ఆర్థిక సేవ‌లు అంద‌రికీ చేరువ‌య్యేందుకు ఆధార్ అవ‌స‌రం ఎంత అనే అంశంపై ఐఎఫ్ఎమ్ఆర్ ఫౌండేష‌న్ లో ప‌నిచేస్నున్న బిందు ఆనంద్ , మాళ‌విక రాఘ‌వ‌న్ చ‌ర్చ జ‌రిపి వారి అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు.

కొన్నేళ్లుగా ఆర్థిక సేవలను ప్ర‌జ‌లంద‌రికీ అందించే దిశ‌గా ప్ర‌య‌త్నాలు కొన‌సాగున్న‌ప్పటికీ దేశంలో కోట్లాది మంది ప్ర‌జలు స్థిర‌మైన రాబ‌డి లేక ఖరీదైన, అనధికారిక ఆర్థిక సేవలను పొందాల్సి వ‌స్తుంది. ఈ స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించి ఆర్థిక సేవ‌లను ప్ర‌జ‌లంద‌రికీ సుల‌భంగా అందించే అవ‌కాశం ఆధార్ తో సాధ్య‌ప‌డుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. గ‌త కొంతకాలంగా మ‌న దేశంలో ఆర్థిక సేవ‌లను అంద‌రికీ చేరువ చేసేందుకు బ్యాంకుల‌ బ్రాంచీల‌ను విస్త‌రించ‌డం అనే మార్గాన్ని ఎంచుకున్నాయి. అయితే ఇది అంత‌గా విజ‌య‌వంతం కాలేదు. ఎందుకంటే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో వినియోగ‌దాద‌ర్ల‌కు అందించే సేవ‌ల‌పై బ్యాంకుల వ్యయం అధికంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 10,000 రుణం ఇచ్చేందుకు ప్ర‌భుత్వ బ్యాంకుల‌కు రూ.4,153 (41.53%), ప్రైవేటు బ్యాంకుల‌కు రూ.3,207 (32.07%) ఖ‌ర్చు అవుతుంది. ఇది బ్యాంకులపై భారంగా మారింది.

ఆధార్, ఇండియా స్టాక్

ఆధార్ ఇండియా స్టాక్ క‌ల‌యిక‌తో ఈ స‌మస్య‌ల‌ను అధిగ‌మించేందుకు సాంకేతిక ప‌రిజ్ఞానం ఉప‌యోగించి ప్ర‌తీ వ్య‌వ‌హారం ఆన్‌లైన్ విధానంలో పూర్తిచేసేందుకు ఇది స‌హ‌క‌రిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానంతో వినియోగదారులకు ఈ -కేవైసీ, రిమోట్ వెరిఫికేషన్, లావాదేవీల‌ ఖర్చులు త‌గ్గిచంవ‌చ్చు. ప్ర‌తీ భార‌తీయుడికి బ్యాంకింగ్ సేవ‌లు పొంద‌డం, చెల్లింపు, స్వీక‌ర‌ణ‌ల‌ను సుల‌భంగా చేయ‌గ‌ల సామర్థ్యాన్నిఆధార్ ఇండియా స్టాక్ అందుబాటులోకి తెచ్చింది. ప్రత్యేక గుర్తింపుదారు వ్యవస్థ (యూఐడీ)లో ఒక స్థాయికి చేరుకున్నాం. ఈ విధానంలో మొదట టెక్నాలజీ అమలు జ‌రిగింది. దీని త‌రువాత ఈ సాంకేతీక ప‌రిజ్ఞానంపై, వీటిని ప‌ర్యవేక్షిస్తున్న సంస్థలపై నమ్మకాన్ని క‌లిగించాల్సి ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీల‌న చేసుకుంటూ లోపాలు, బలహీనతలను సరిచేసుకోవలసి ఉంటుంది.

వినియోగ‌దారుల స‌మాచార భ‌ద్ర‌త‌

ఈ విధానం వినియోగదారుల భద్రతను మెరుగుపరుస్తుంది. ఆధార్ ను డిజిట‌ల్ లావాదేవీల్లో వినియోగించే ఆర్థిక‌సేవ‌ల సంస్థ‌లు, యూఐడీఏఐ , వినియోగ‌దార్లకు అమ‌లు ప‌ర‌చాల్సిన కొన్నినిబంధ‌న‌లున్నాయి. లావాదేవీ పూర్త‌యిన త‌రువాత అవి స‌క్ర‌మంగా జ‌ర‌గ‌న‌పుడు వినియోగ‌దార్ల‌కు న‌గ‌దు తిరిగి చెల్లించాలి. ఆధార్ అనుసంధానిత ఖాతాల‌కు ఇది చాలా అవ‌స‌రం. వీటి వినియోగం పెరుగుతున్న కొల‌దీ సాంకేతిక స‌మ‌స్య‌ల మూలంగా జ‌రిగే న‌ష్టాల‌కు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.

అన‌ధికారిక‌ ఎల‌క్ట్రానిక్ న‌గ‌దు బ‌దిలీల‌కు సంబంధించి రిజ‌ర్వుబ్యాంకు కొన్ని ముఖ్య‌మైన నిబంధ‌న‌ల‌ను జారీచేసింది. ఆధార్ ఆధారిత లావాదేవీల‌ విధానంలో కూడా బ్యాంకింగేత‌ర సంస్థ‌లు, థ‌ర్డ్ పార్టీల‌కు సంబంధించిన లావాదేవీల‌కు నిబంధ‌న‌ల‌ను రూపొందించాల్పి ఉంది.

ప్ర‌స్తుతం 115కోట్ల ఆధార్ సంఖ్య‌లున్నాయి. ఇంత మంది ప్ర‌జ‌ల‌కు చెందిన స‌మాచారం డేటాబేస్ లో ఉంటుంది. కాబ‌ట్టి వీటికి స‌రైన ఆడిట్, జ‌వాబుదారీత‌నం ఉండాల్సిన అవ‌స‌ర‌ముంది.

ఆధార్ ఆధారిత లావాదేవీల‌పై స్వ‌తంత్ర ప‌ర్య‌వేక్షణ‌ విభాగం ఉండాలి:

ఆధార్ ఆధారంగా జ‌రిపే లావాదేవీలను ప‌ర్య‌వేక్షించేందుకు స్వ‌తంత్ర విభాగం ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ లావాదేవీల విష‌యాల‌ను, స‌మ‌స్య‌ల‌ను ప‌రిశీలించ‌డం ద్వారా మ‌రింత మెరుగైన విధానంలో సేవ‌ల‌ను అందించే ఆస్కారం ఉంటుంది.

ఆధార్ ఫిర్యాదులస్వీక‌ర‌ణ‌ పద్దతిని సంస్కరించాల్సిన అవసరం ఉంది:

ప్రస్తుతం యూఏఐడీఐ ఒక అపారదర్శక ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను కలిగి ఉంది. ప్రత్యేకంగా ఆధార్ చట్టం యూఏఐడీఐ వినియోగదారుల సమాచారం దుర్వినియోగం కోసం మాత్రమే అధికారులను చర్యలు తీసుకునేందుకు వీలు కల్పిస్తుంది. దీన్ని మ‌రింత సంస్క‌రించాల్సిన అవ‌స‌రం ఉంది.

చివ‌ర‌గా

ఆధార్ లాంటి ప్రాజెక్టును విజ‌య‌వంతం చేయాలంటే పైన‌ చ‌ర్చించిన అంశాల‌ను అమ‌లుచేయాలి. త‌ద్వారా వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని