కంపెనీల సామాజిక బాధ్యతకు వ్యాక్సినేషన్‌ను జతచేయండి

కంపెనీల కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)లో కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌లో కొన్ని అంశాలను జతచేయాల్సిందిగా ప్రభుత్వానికి భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సూచించింది. 2013 కంపెనీల

Published : 18 Jan 2021 00:39 IST

ప్రభుత్వానికి సీఐఐ సూచన

దిల్లీ: కంపెనీల కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)లో కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌లో కొన్ని అంశాలను జతచేయాల్సిందిగా ప్రభుత్వానికి భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సూచించింది. 2013 కంపెనీల చట్టం ప్రకారం.. లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలు మూడేళ్ల సగటు నికర లాభంలో కనీసం 2 శాతాన్ని సీఎస్‌ఆర్‌ కార్యకలాపాలపై ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఈ వ్యయాలను వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు అంగీక రిస్తే, కంపెనీలు తమ ఉద్యోగులకు వ్యాక్సిన్‌లు అందిస్తాయని.. తద్వారా మరింత మందికి సులభంగా వ్యాక్సిన్‌లు చేరుతాయని సీఐఐ టాస్క్‌ఫోర్స్‌ పేర్కొంది. నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌లకు సీఐఐ టాస్క్‌ఫోర్స్‌ పలు ముఖ్యమైన సిఫారసులు చేసింది. ప్రజలకు వ్యాక్సిన్‌లు అందించడానికి పీపీపీ పద్ధతిలో మొదటి దశ నుంచే ప్రైవేట్‌ రంగ సామర్థ్యాలను వినియోగించుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని