NPS: 65 ఏళ్లు నిండిన‌ త‌రువాత ఎన్‌పీఎస్‌లో చేరొచ్చు.. 

65 నుంచి 70 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సులో కూడా ఎన్‌పీఎస్‌లో చేరి 75 సంవ‌త్స‌రాల వ‌ర‌కు ఖాతాను కొన‌సాగించవ‌చ్చు.  

Updated : 30 Aug 2021 15:28 IST

పెన్ష‌న్ ఫండ్ రెగ్యులేట‌రీ అండ్ డ‌వ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ), ఎన్‌పీఎస్ ప్ర‌వేశ‌ వ‌య‌సును పెంచ‌డంతో పాటు నిష్క్ర‌మ‌ణ నియాల‌ను స‌డ‌లించింది. 65 ఏళ్లు నిండిన చందాదారులు కూడా 50శాతం నిధుల‌ను ఈక్విటీల‌కు మ‌ళ్లించేందుకు అనుమ‌తించింది. 

ఎన్‌పీఎస్‌లో చేరేందుకు ప్ర‌స్తుత ప్ర‌వేశ వ‌య‌సు 18 నుంచి 65 సంవ‌త్స‌రాలు. ప్ర‌స్తుతం దీన్ని 70 సంవ‌త్స‌రాల‌కు పొడిగించారు. 60 ఏళ్లు దాటిన వారు, సూప‌ర్‌యాన్యుటేష‌న్ తీసుకున్న వారు పెట్టుబ‌డులు పెట్టేందుకు, అలాగే 65 సంవ‌త్స‌రాల దాటిన సీనియ‌ర్ సిటిజ‌న్లు కూడా ఎన్‌పీఎస్‌లో ఖాతా తెరిచేందుకు వీలుక‌ల్పిస్తూ ప్ర‌వేశ వ‌య‌సును 70 సంవ‌త్స‌రాల‌కు పొడిగించారు.  ప్ర‌స్తుత చందాదారుల నుంచి పెద్ద సంఖ్య‌లో వ‌స్తున్న‌ అభ్య‌ర్థ‌న‌లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పీఎఫ్ఆర్‌డీఏ త‌న స‌ర్కుల‌ర్‌లో పేర్కొంది.

ఎవ‌రు చేర‌చ్చు..
భారతీయ పౌరులు లేదా విదేశాల్లో నివాసం ఉంటున్న భారతీయ పౌరులు (ఓసీఐ).. 18 నుంచి 70 సంవ‌త్స‌రాల వ‌య‌సు వారు చేరొచ్చు. అంటే..65 నుంచి 70 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సులో కూడా ఎన్‌పీఎస్‌లో చేరి 75 సంవ‌త్స‌రాల వ‌ర‌కు ఖాతాను కొన‌సాగించవ‌చ్చు.  పాత నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ఇప్ప‌టికే ఖాతాను మూసివేసిన వారు కూడా తాజా స‌వ‌ర‌ణ‌ల‌తో తిరిగి కొత్త‌గా ఖాతాను తెర‌వ‌చ్చు. 

పెన్ష‌న్ ఫండ్‌, పెట్టుబ‌డుల ఎంపిక‌..
65 ఏళ్ల తర్వాత ఎన్‌పీఎస్‌లో చేరే వారు పీఎఫ్‌, పెట్టుబ‌డుల‌ను కేటాయింపును చేయ‌వ‌చ్చు. అయితే ఈక్వీటీల‌లో గ‌రిష్టంగా..ఆటో ఆప్షన్‌ కింద 15 శాతం, యాక్టివ్‌ చాయిస్‌ ఆప్షన్‌ కింద 50 శాతం  కేటాయించుకునేందుకు అవకాశం ఉంటుంది. పీఎఫ్‌ను సంవ‌త్స‌రానికి ఒక‌సారి, పెట్టుబ‌డుల కేటాయింపును సంవ‌త్స‌రానికి రెండు సార్లు మార్చుకోవ‌చ్చు.

65 ఏళ్ల వ‌య‌సు త‌ర్వాత ఎన్‌పీఎస్‌లో చేరే వారికి వ‌ర్తించే నిష్క్ర‌మ‌ణ‌, విత్‌డ్రా నియ‌మాలు..
*
సాధార‌ణంగా 3 సంవ‌త్స‌రాల త‌రువాత ప‌థ‌కం నుంచి బ‌య‌టకు వెళ్ల‌చ్చు. అయితే 40 శాతం కార్ప‌స్‌ను యాన్యూటి కొనుగోలుకి వినియోగించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ఒక‌వేళ మొత్తం కార్పిస్ రూ. 5 ల‌క్ష‌లు, అంత‌కంటే త‌క్కువ ఉంటే, చంద‌దారుడు సేక‌రించిన పెన్ష‌న్ నిధి మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. 

* 3 సంవ‌త్స‌రాల పూర్తికాక‌ముందే ఖాతాను మూసివేయాల‌నుకుంటే అకాల నిష్క్ర‌మ‌ణ‌గా ప‌రిగ‌ణిస్తారు. చందాదారుడు 80శాతం కార్ప‌స్ యాన్యూటీల‌లో పెట్టుబ‌డి పెట్టాల్సి ఉంటుంది. మిగిలిన 20శాతం మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ఒక‌వేళ  మొత్తం కార్ప‌స్‌ రూ. 2.5 ల‌క్ష‌లు, అంత‌కంటే త‌క్కువ ఉంటే, చంద‌దారుడు సేక‌రించిన పెన్ష‌న్ నిధి మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. 

* దురదృష్టవశాత్తు చందాదారుడు మరణిస్తే, కార్పస్ మొత్తం చందాదారుడి నామినీకి చెల్లిస్తారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు