Air Travel: జూన్‌లో పుంజుకున్న ప్రయాణాలు!

కరోనా రెండో దశ ఉద్ధృతి అదుపులోకి రావడంతో రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ఎత్తివేస్తున్నాయి. దీంతో విమాన ప్రయాణాలు పుంజుకుంటున్నాయి. మే నెలలో నమోదైన 42 వేల మంది ప్రయాణికులతో పోలిస్తే జూన్ మూడో వారం ప్రారంభం నాటికి.....

Published : 25 Jun 2021 21:09 IST

దిల్లీ: కరోనా రెండో దశ ఉద్ధృతి అదుపులోకి రావడంతో రాష్ట్రాలు లాక్‌డౌన్లు ఎత్తివేస్తున్నాయి. దీంతో విమాన ప్రయాణాలు పుంజుకుంటున్నాయి. మే నెలలో నమోదైన రోజువారీ సగటు ప్రయాణికుల సంఖ్య 42 వేలతో పోలిస్తే జూన్ మూడో వారం ప్రారంభం నాటికి ఆ సంఖ్య మూడింతలు పెరిగి 1,25,000లకు చేరినట్లు ప్రముఖ విమానయాన సంస్థల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నెలలో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. జూన్‌ రెండో వారం నుంచి నమోదైన రోజువారీ సగటు ప్రయాణికుల సంఖ్య.. మార్చి రోజువారీ సగటు 3,13,000లో 40 శాతమే కావడం గమనార్హం. మార్చిలో విమానయాన రంగం సాధారణ పరిస్థితులకు దగ్గరగా వచ్చింది. కానీ, రెండో వేవ్‌ విరుచుకుపడడంతో పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. కొవిడ్‌ మునుపటి సంఖ్య 4,14,000 పోలిస్తే జూన్‌లో ఇప్పటి వరకు నమోదైన రోజువారీ సగటు ప్రయాణికుల సంఖ్య 30 శాతమే కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని