AirAsia: మే15 వరకూ ఆ ఛార్జీలు ఉండవు

టికెట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత పరిస్థితులు సహకరించని కారణంగా సమయం, తేదీ మార్చుకుంటే అందుకు

Updated : 18 Apr 2021 18:58 IST

న్యూదిల్లీ: టికెట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత పరిస్థితులు సహకరించని కారణంగా సమయం, తేదీ మార్చుకుంటే అందుకు విమానయాన సంస్థలు అదనపు మొత్తాన్ని వసూలు చేస్తాయన్న సంగతి తెలిసిందే. మే 15వ తేదీ వరకూ బుక్‌ చేసుకున్న టికెట్లకు సంబంధించి సమయం, తేదీ మార్పులు చేసుకునే ప్రయాణీకులపై ఎలాంటి రుసుములు విధించమని ఎయిర్‌ ఏషియా తెలిపింది.

‘మే 15వ తేదీ వరకూ బుక్‌ చేసుకున్న టికెట్లపై సమయం, తేదీలను ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. ఇందుకు ఎలాంటి రుసుము వసూలు చేయబోం’ అని ఎయిర్‌ ఏషియా ప్రకటించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తుండటంతో పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇండిగో, స్పైస్‌ జెట్‌లు కూడా ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించాయి. అయితే స్పైస్‌జెట్‌ మాత్రం ప్రయాణానికి ఐదు రోజుల ముందు వరకూ మాత్రమే తేదీ, సమయం మార్చుకునే అవకాశం కల్పిస్తోంది. అంతకుముందు ఇది రోజులు ఉండేది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని