ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ మూడంచెల భద్రత

తన వినియోగదార్లు ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ మోసాల బారిన పడకుండా నెట్‌వర్క్‌ ఇంటలిజెన్స్‌తో ‘ఎయిర్‌టెల్‌ సేఫ్‌ పే’ పేరిట...

Updated : 21 Jan 2021 01:02 IST

దిల్లీ: తన వినియోగదార్లు ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ మోసాల బారిన పడకుండా నెట్‌వర్క్‌ ఇంటలిజెన్స్‌తో ‘ఎయిర్‌టెల్‌ సేఫ్‌ పే’ పేరిట మూడో భద్రతా వలయాన్ని ఎయిర్‌టెల్‌ చెల్లింపుల బ్యాంకు జత చేసింది. ప్రస్తుతం బ్యాంకులు రెండు అంచెల భద్రత (ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌, వన్‌ టైం పాస్‌వర్డ్‌)ను అవలంబిస్తున్నాయి. ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ తీసుకొచ్చిన ఈ మూడో అంచె వల్ల రియల్‌ టైంలో ధ్రువీకరణ అలర్ట్‌ ఖాతాదారు మొబైల్‌కు వస్తుంది. ‘మీరు దానిని అంగీకరిస్తే మినహా లావాదేవీ జరగదు. ఈ చర్య భారత డిజిటల్‌ చెల్లింపుల రంగంలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పుతుంది. మా వినియోగదార్లకు వారి లావాదేవీలపై పూర్తి నియంత్రణ ఉండేలా చేశామ’ని ఎయిర్‌టెల్‌ చెల్లింపుల బ్యాంక్‌ ఎండీ, సీఈఓ అనుబ్రత బిశ్వాస్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎయిర్‌టెల్‌ సేఫ్‌ పే అనేది పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. ఎయిర్‌టెల్‌ థాంక్స్‌ యాప్‌ హోమ్‌ స్క్రీన్‌ లేదా బ్యాంకింగ్‌ విభాగం ద్వారా దీనిని యాక్టివేట్‌ చేసుకోవచ్చు. దీని వల్ల వినియోగదార్లు ఫిషింగ్‌, ఫోన్‌ క్లోనింగ్‌, పాస్‌వర్డ్‌ల దొంగతనం వంటి మోసాల బారిన పడరని ఆ కంపెనీ అంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని