Airtel: ఎయిర్‌టెల్‌ అదనపు డేటా కూపన్ల ఉపసంహరణ.. ఎందుకంటే

ఇటీవల వివిధ ప్రీపెయిడ్‌ పథకాల టారిఫ్‌లను పెంచిన టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. యాప్‌ ద్వారా పలు ప్రీపెయిడ్‌ ప్లాన్లపై అందిస్తున్న అదనపు డేటా కూపన్లను ఉపసంహరించుకున్నట్లు తెలిపింది....

Published : 27 Nov 2021 16:30 IST

దిల్లీ: ఇటీవల వివిధ ప్రీపెయిడ్‌ పథకాల టారిఫ్‌లను పెంచిన టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. యాప్‌ ద్వారా పలు ప్రీపెయిడ్‌ ప్లాన్లపై అందిస్తున్న అదనపు డేటా కూపన్లను ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. వీటి వల్ల వివిధ ప్లాన్ల ఆఫర్లను పోల్చుకోవడంలో వినియోగదారుల్లో గందరగోళం తలెత్తుతోందని తెలిపింది. దీన్ని నివారించడానికే కూపన్లను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంది. 

వాయిస్‌ పథకాలు, అపరిమిత ప్లాన్‌లు, డేటా టాప్‌ అప్స్‌ వంటి పథకాల ధరలను 20-25 శాతం పెంచుతూ ఇటీవలే ఎయిర్‌టెల్‌ ప్రకటన చేసింది. ఈ పెంచిన ఛార్జీలు ఈనెల 26 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రారంభ స్థాయి ప్లాన్‌ల ధర దాదాపు 25 శాతం పెరగ్గా, అపరిమిత పథకాల ధరలు దాదాపు 20 శాతం పెరిగాయి. డేటా టాప్‌అప్‌ పథకాల ధరలను 20-21 శాతం మేర కంపెనీ పెంచింది. కంపెనీ ఆర్థికంగా స్థిరంగా ఉండాలంటే వినియోగదారుపై సగటు ఆదాయం (ఆర్పు) నెలకు రూ.200కు చేరాలని, తదుపరి రూ.300 కావాల్సిన అవసరం ఉందని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. నెట్‌వర్క్‌ - స్పెక్ట్రమ్‌ కోసం పెట్టుబడులకు, దేశంలో 5జీ సేవల ప్రారంభానికి ఇది అవసరమని వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని