XUV700 Launched: మార్కెట్లోకి మహీంద్రా ఎక్స్‌యూవీ 700

మహీంద్రా అండ్‌ మహీంద్రా సరికొత్త ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీని ఎక్స్‌యూవీ 700ను విడుదల చేసింది. దీని ప్రారంభ వేరియంట్‌ ధర రూ.11.99 లక్షలు ఉండగా.. టాప్‌ వేరియంట్‌

Published : 30 Sep 2021 19:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మహీంద్రా అండ్‌ మహీంద్రా సరికొత్త ఫ్లాగ్‌షిప్‌ కారు ఎక్స్‌యూవీ 700ను విడుదల చేసింది. దీని ప్రారంభ వేరియంట్‌(ఎక్స్‌షోరూం) ధర రూ.11.99 లక్షలుగా.. టాప్‌ వేరియంట్‌ ధర రూ.21.09లక్షలుగా నిర్ణయించారు. దీనిని పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్లతో తొమ్మది వేరియంట్లల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆల్‌వీల్‌ డ్రైవ్‌  ఫీచర్‌ కూడా ఉంది. ఐదు, ఏడు సీట్ల ఆప్షన్లలో లభిస్తుంది.  అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ఈ వాహనం షోరూమ్‌లలో అందుబాటులో ఉండనుంది. ఏడో తేదీ నుంచి బుకింగ్స్‌ స్వీకరిస్తారు. అక్టోబర్‌ 10 తేదీ నుంచి డెలివరీలు మొదలవుతాయి. ఈ కారును మోకాక్‌ ప్లాట్‌ఫామ్‌పై మహీంద్రా అభివృద్ధి చేసింది. ఎక్స్‌యూవీ 500 కంటే ఇది భారీగా ఉంటుంది.

ఇంజిన్‌ వివరాలు..

* పెట్రోల్‌: ఎక్స్‌యూవీ 700 పెట్రోల్‌ వెర్షన్‌ 2.0లీటర్‌ 4 సిలిండర్‌ ఇంజిన్‌ అమర్చారు. ఇది అత్యధికంగా 187 బీహెచ్‌పీ శక్తి, 380 పీక్‌ టార్క్‌ను విడుదల చేయగలదు. దీనికి 6 స్పీడ్‌ మాన్యూవల్‌,ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌లను అప్షనల్‌గా ఇచ్చారు. 

* డీజిల్‌ ఎంఎక్స్‌ విభాగం : ఎక్స్‌యూవీ 700 డీజిల్‌ వెర్షన్‌కు 2.2 లీటర్‌ 4 సిలిండర్‌ ఇంజిన్‌ అమర్చగా. ఇది 153 బీహెచ్‌పీ శక్తిని, 360 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. 6స్పీడ్‌ మాన్యూవల్‌ ట్రాన్స్‌మిషన్‌ గేర్‌ బాక్స్‌ ఉంది. 

* డీజిల్‌ ఏఎక్స్‌ విభాగం: విలాసవంతమైన ఫీచర్లతో ఉండే డీజిల్‌ ఏక్స్‌ విభాగంలో 2.2 లీటర్‌ ఇంజిన్‌ ఇచ్చారు. ఇది 182 బీహెచ్‌పీ శక్తిని, అత్యధికంగా 450 ఎన్‌ఎం టార్క్‌ను  విడుదల చేస్తుంది. దీనికి 6 స్పీడ్‌ మాన్యూవల్‌, ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ ఆప్షన్‌గా లభిస్తాయి.  

ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్స్‌, సీ షేప్‌ డేటైమ్‌ రన్నింగ్‌ ఎల్‌ఈడీ లైట్లు, సరికొత్త అలాయ్‌ వీల్స్‌, ఫ్లష్‌ ఫిట్టింగ్‌ డోర్‌ హ్యాండిల్స్‌, సిల్వర్‌ క్లాడింగ్‌తో బంపర్‌,

అత్యంత సౌకర్యవంతంగా..!

ఈ కారులో అత్యాధునిక ఫీచర్లను మహీంద్రా అందించింది. ది వాయిస్‌ కమాండ్స్‌తో పనిచేసే అడ్రోనొక్స్‌ కనెక్టెడ్‌ ఫీచర్‌ను ఇచ్చింది. దీని ద్వారా కారుకు పలు కమాండ్స్‌ ఇవ్వవచ్చు. 12 స్పీకర్లతో సోనీ 3డీ సౌండ్‌ సిస్టమ్‌, 6 రకాలుగా సీట్లను అడ్జెస్ట్‌ చేసుకొనే విధానం, పనోరమిక్‌ సన్‌రూఫ్‌, సైడ్‌, ఫ్రంట్‌ ఎయిర్‌బ్యాగ్స్‌, 360 సరౌండెడ్‌ కెమేరా, బ్లైండ్‌ వ్యూ మానిటరింగ్‌, హిల్‌ హోల్డ్‌,  ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ వంటివి సౌకర్యాలను ఉన్నాయి. డైనమిక్‌ స్టేబుల్‌ ప్రోగ్రామ్‌ కూడా దీనిలో ఉంది. 

ఈ కారులో మూడు డ్రైవింగ్‌ మోడ్‌లు ఉన్నాయి. ఒకటి కస్టమర్‌ తనకు అనుకూలంగా సెట్‌ చేసుకోవచ్చు. 8 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, 7 అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ ఆటో, స్టీరింగ్‌పైనే కంట్రోలింగ్‌ స్విచ్‌లు, డే అండ్‌ నైట్‌ ఐవీఆర్‌ఎం ఫీచర్లు ఉన్నాయి. ఏఎక్స్‌ సిరీస్‌లో మాత్రం 10.25 అంగుళాల ఇనుస్ట్రుమెంట్‌, ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌, వెంటిలేటెడ్‌ సీట్లు, అమెజాన్‌ అలెక్సా, వైర్‌లెస్‌ ఆండ్రాయిడ్‌ ఆటో, యాపిల్‌ కార్‌ ప్లే, అడ్వాన్స్‌డు డ్రైవ్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌ వంటి సౌకర్యాలను అదనంగా ఇచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని