ఎఫ్‌డీల‌కు ప్ర‌త్యామ్నాయం ఏంటి?

సేవింగ్సు ఖాతా, ఫిక్సిడ్ డిపాజిట్లకు బ‌దులుగా డ‌బ్బు ఉంచుకోవాలంటే ఏయే మార్గాలు ఉన్నాయో తెలుసుకుందాం. సేవింగ్సు బ్యాంకు ఖాతాకు ప్ర‌త్యామ్నాయంగా లిక్విడ్‌ ఫండ్ల‌ను చెప్ప‌వ‌చ్చు. వీటి గురించి చెప్పాలంటే ఒక‌రోజు కాల‌ప‌రిమితి తో కూడా మ‌దుపు చేసే అవ‌కాశం వీటితో ల‌భిస్తుంది. వీటికి లిక్వ‌డిటీ ఎక్కువ‌గా ఉంటుంది. సేవింగ్సు బ్యాంకు..

Published : 16 Dec 2020 16:04 IST

సేవింగ్సు ఖాతా, ఫిక్సిడ్ డిపాజిట్లకు బ‌దులుగా డ‌బ్బు ఉంచుకోవాలంటే ఏయే మార్గాలు ఉన్నాయో తెలుసుకుందాం. సేవింగ్సు బ్యాంకు ఖాతాకు ప్ర‌త్యామ్నాయంగా లిక్విడ్‌ ఫండ్ల‌ను చెప్ప‌వ‌చ్చు. వీటి గురించి చెప్పాలంటే ఒక‌రోజు కాల‌ప‌రిమితి తో కూడా మ‌దుపు చేసే అవ‌కాశం వీటితో ల‌భిస్తుంది. వీటికి లిక్వ‌డిటీ ఎక్కువ‌గా ఉంటుంది. సేవింగ్సు బ్యాంకు ఖాతాలో వ‌డ్డీ రేటుర 4శాతం ఉంటే దీంట్లో 6శాతం వ‌ర‌కూ వ‌స్తుంది.లిక్విడ్ ఫండ్ల గురించి మ‌రింత స‌మాచారం . ఫిక్సిడ్ డిపాజిట్లకు బ‌దులుగా వాటికి స‌రిపోయే పెట్టుబ‌డి సాధ‌నాల‌ను ఇక్క‌డ చూడొచ్చు. డెట్ ఫండ్లు - డెట్ ఫండ్లు వివిధ స్థిరాదాయ ప‌థ‌కాల్లో పెట్టుబ‌డి చేస్తాయి. కాబ‌ట్టి వాటికి న‌ష్ట‌భ‌యం త‌క్కువ‌గా ఉంటుంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ రకాల డెట్‌ ఫండ్లు. ఇన్‌క‌మ్ ఫండ్లు - వీటిలో స్వ‌ల్ప మ‌ధ్య దీర్ఘ‌కాల కాల‌ప‌రిమితుల‌తో ఉంటాయి. ఏడాది లోపు కాల‌ప‌రిమితి ఉన్న ఫండ్ల‌ను స్వ‌ల్ప‌కాల ఇన్‌క‌మ్ ఫండ్లు అని, ఏడాది నుంచి మూడేళ్ల లోపు ఉండే వాటినిమ‌ధ్య‌కాల‌వ్య‌వ‌ధి క‌లిగిన ఫండ్లు, మూడేళ్లు పై బ‌డిన వాటిని దీర్ఘ‌కాల ఇన్‌క‌మ్ ఫండ్లు అని అంటారు.ఇవి సర్టిఫికెట్‌ ఆఫ్‌ డిపాజిట్స్‌ (సీడీ), కమర్షియల్‌ పేపర్ల (సీపీ) కార్పోరేట్ బాండ్లు త‌దిత‌ర వాటిలో మదుపు చేస్తాయి.

ఫిక్సిడ్ డిపాజిట్లు కూప‌న్ రూపంలో ల‌భించే ఆదాయం పొందాల‌నుకుంటే ఇన్‌క‌మ్ ఫండ్ల‌లో మ‌దుపు చేసి వాటినుంచి ప్ర‌తీ నెల లేదా మ‌న‌కు కావ‌ల్సిన స‌మ‌యంలో సిస్ట‌మేటిక్ విత్రాడాయిల్ ప్లాన్(ఎస్‌డ‌బ్ల్యూపీ) ద్వారా బ్యాంకు ఖాతాలోకి డ‌బ్బు జ‌మ‌చేసుకోవ‌చ్చు. ఫిక్సిడ్ మెచ్యూరిటీ ప్లాన్ ఫండ్లు: నిర్ణీత కాల‌ప‌రిమితితో స్థిరాదాయ పెట్టుబ‌డి సాధ‌నాల్లో మ‌దుపు చేయాల‌నుకునే వారికి ఫిక్స్‌డ్ మెచ్యురిటీ ప్లాన్ లు అనుకూల‌మైన‌వి . కొన్ని నెల‌ల నుంచి కొన్ని సంత్స‌రాల వ‌ర‌కు వివిధ ర‌కాల కాల‌ప‌రిమితిల‌తో అందుబాటులో ఉంటాయి. మ‌దుప‌ర్ల నుంచి స‌మీక‌రించిన నిధుల‌ను ఆ ఫండ్ కు స‌రిపోయే లేదా త‌క్కువ మెచ్యూరిటీలో ఉన్న‌ప్ర‌భుత్వ, ప్రైవేట్ బాండ్లు, మ‌నీమార్కెట్ త‌దిత‌ర పెట్టుబ‌డి సాధ‌నాల‌లో ఫండ్ నిర్వాహ‌కులు పెట్టుబ‌డి చేస్తారు. మ‌దుప‌ర్లు ఫండ్ ఆఫ‌ర్ స‌మ‌యంలో నిర్వాహ‌కుల నుంచి యూనిట్ల‌ను కొనుగోలుచేయ‌వ‌చ్చు. ఒక సారి గ‌డువు ముగిసాక మ‌ధ్య‌లో నిర్వాహ‌కుల నుంచి యూనిట్ల‌ను కొన‌డం కుద‌ర‌దు. ఆర్బిట్రాజ్ ఫండ్లు: ఏక‌కాలంలో ఏదైనా వ‌స్తువుకు రెండు వేర్వేరు ప్రాంతాల్లో ధ‌ర వ్య‌త్యాసాలు ఉంటే త‌క్కువ ఉన్న ద‌గ్గ‌ర కొనుగోలు చేసి ఎక్కువున్న ద‌గ్గ‌ర అమ్మకం చేసి రాబ‌డిని పొంద‌డాన్ని ఆర్బిట్రాజ్ అంటారు. ఈ నిమ‌యం ఆధారంగా చేసుకుని మ‌దుపుచేసే మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఆర్బిట్రాజ్ ఫండ్లు అంటారు. న‌ష్ట‌భ‌యం త‌క్కువ‌గా ఉండే ఆర్బిట్రాజ్ ఫండ్లు. పోస్టాఫీసు ప‌థ‌కాల్లో ట‌ర్మ్ డిపాజిట్లు: కేంద్ర ప్ర‌భుత్వం ప‌రిధిలో ఉండే పోస్టాఫీసులు భ‌ద్ర‌త ఎక్కువ క‌లిగి ఉంటాయి.పోస్టాఫీసు ప‌థ‌కాల్లో ట‌ర్మ్ డిపాజిట్లు పూర్తి క‌థ‌నం కోసం చూడండి. ప్ర‌భుత్వ బాండ్లు: ప్ర‌భుత్వ బాండ్ల కేట‌గిరీలో దృవ్యోల్బ‌ణ ఆధారిత ప్ర‌భుత్వ బాండ్లు, ప‌న్ను ఆదా బాండ్లు ఉంటాయి. ప్ర‌భుత్వ బాండ్లు ఇవి నేరుగా ప్ర‌భుత్వం జారీ చేస్తుంది కాబ‌ట్టి వీటిలో న‌ష్ట‌భ‌యం ఉండ‌ద‌నే చెప్పాలి. వీటిని నిర్ణీత కాల‌ప‌రిమితితో మ‌దుపు చేయాలి. ఆరు నెల‌ల‌కు ఒక సారి కూప‌న్ రూపంలో వ‌డ్డీ ఆదాయం మ‌దుప‌ర్లు పొందుతారు. ప్ర‌భుత్వ బాండ్ల‌లో మ‌దుపుచేయండిలా. నేష‌న‌ల్ సేవింగ్స్ స‌ర్టిఫికేట్, సీనియ‌ర్ సిటిజ‌న్స్ సేవింగ్స్ స్కీమ్ ప్ర‌భుత్వ ప‌ధ‌కాలు మ‌దుప‌ర్ల‌కు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మ‌దుప‌ర్లు త‌మ‌కు అనుకూలంగా ఉన్న‌ వాటిని ఎంచుకోవ‌చ్చు.

కంపెనీ ఫిక్సిడ్ డిపాజిట్లు: కార్పొరేట్‌ కంపెనీలు మూలధనాన్నిసమీకరించేందుకు ఫిక్సిడ్ డిపాజిట్లను జారీచేస్తాయి. కనీసం కాలపరిమితి సంవత్సరం మొదలుకొని గరిష్ఠంగా 10 ఏళ్ల కాలపరిమితి కలిగిన కార్పొరేట్‌ ఫిక్సిడ్ డిపాజిట్లను కంపెనీలు జారీ చేస్తున్నాయి. బ్యాంకు ఫిక్సిడ్ డిపాజిట్‌ల కంటే వీటిపై వడ్డీ కాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే ఇవి కొంత నష్టభయంతో కూడుకున్నవి. మంచి రేటింగ్‌ ఉన్న కంపెనీ ఫిక్సిడ్ డిపాజిట్లను ఎంచుకోవడం ద్వారా న‌ష్ట‌భ‌యాన్ని త‌గ్గించుకోవ‌చ్చు.

స్థిరాదాయ పెట్టుబ‌డి సాధ‌నాలు వివిధ కాల ప‌రిమితుల్లో అందుబాటులో ఉన్నాయి. కాబ‌ట్టి మ‌దుప‌ర్లు త‌మ రాబ‌డి అంచ‌నా న‌ష్ట‌భ‌యం త‌దిత‌ర విష‌యాల‌ను ప‌రిగ‌న‌ణ‌లోకి తీసుకుని మ‌దుప‌ర్లు త‌మ‌కు అనుకూలంగా ఉన్న‌వాటిని ఎంచుకోవ‌చ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని