Amazon Mobile Savings Days Sale: స్మార్ట్‌ఫోన్లపై 3రోజుల డిస్కౌంట్‌ సేల్‌

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ ఇండియా తగ్గింపు ధరలతో మొబైల్‌ ఫోన్ల సేల్‌కు

Published : 16 Aug 2021 19:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ ఇండియా తగ్గింపు ధరలతో మొబైల్‌ ఫోన్ల సేల్‌కు సిద్ధమైంది. ‘మొబైల్‌ సేవింగ్‌ డేస్‌’ పేరిట మూడు రోజులపాటు సేల్‌ నిర్వహించనుంది. ఈ సేల్‌ ఆగస్టు 16 నుంచి 19వ తేదీ వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుందని అమెజాన్‌ ప్రకటించింది. ప్రత్యేకంగా స్మార్ట్‌ఫోన్లు, వాటి ఉపకరణాలపై దాదాపు 40 శాతం వరకూ డిస్కౌంట్‌ ఆఫర్లను ఇస్తున్నట్లు పేర్కొంది. అలాగే కొనుగోళ్లపై 12 నెలల వరకు నో-కాస్ట్‌ ఈఎమ్‌ఐతో పాటు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ వంటి ఆఫర్లను అందిస్తోంది. ఇండస్ ఇండ్ బ్యాంక్, సిటీ బ్యాంక్ క్రెడిట్‌, డెబిట్ కార్డు వినియోగదారులకు 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ కూడా లభిస్తోంది. అమెజాన్‌ ప్రైమ్ యూజర్లకు ‘అడ్వాంటేజ్ జస్ట్ ఫర్ ప్రైమ్’ పథకం కింద హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో ఆరు నెలల ఉచిత స్క్రీన్ రిప్లేస్‌మెంట్‌తో పాటు కనీసం మూడు నెలల అదనపు నో కాస్ట్ ఈఎమ్‌ఐ ప్రయోజనాలను పొందవచ్చు.

వన్‌ప్లస్‌, షావోమీ, సామ్‌సంగ్‌, రియల్‌ మీ, ఐక్యూ వంటి కంపెనీల స్మార్ట్‌ఫోన్లపై 10శాతం వరకు డిస్కౌంట్‌ ఇవ్వనుంది. వన్‌ప్లస్‌ 9ఆర్‌, వన్‌ప్లస్‌ నోర్డ్‌ సీఈ, రెడ్‌మీ నోట్‌ 10 సిరీస్‌, రెడ్‌ మీ 9 సిరీస్‌, ఎమ్‌ఐ 11 ఎక్స్‌, సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎమ్‌21, ఎమ్‌ 32, ఎమ్‌31, రియల్‌ మీ ఎక్స్‌7, ఐక్యూ 7 సిరీస్‌,  ఐక్యూ జడ్3 వంటి వాటిపైనా ఈ ఆఫర్లు వర్తిస్తాయి. వన్‌ప్లస్‌ 9 ధర రూ.45,999గా ఉంది. దీనిపై రూ.4000 డిస్కౌంట్‌ను కూపన్‌ రూపకంగా లభిస్తోంది. ఎమ్‌ఐ 11ఎక్స్‌ పైనా అదనంగా రూ.5000 వరకు ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌, రెడ్‌ మీ నోట్‌ 10 సిరీస్‌పైనా మరిన్ని బ్యాంక్‌ ఆఫర్లు ఉన్నాయి. షావోమీ స్మార్ట్‌ఫోన్లపై 18 నెలల నో కాస్ట్‌ ఈఎమ్‌ఐ సదుపాయం ఉంది. ఒప్పో ఎఫ్‌ 17 పైనా రూ.2000 వరకు డిస్కౌంట్‌ను కూపన్‌ పద్ధతిలో కొనుగోలుదారులకు అందిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని