Amazon-Future Deal: ట్రైబ్యునల్‌కు అమెజాన్-ఫ్యూచర్ వివాదం?
ఫ్యూచర్ గ్రూప్‌తో జరుగుతున్న వివాదంలో అమెజాన్ తాజాగా నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (NCLAT)ను ఆశ్రయించింది....
దిల్లీ: ఫ్యూచర్ గ్రూప్‌తో జరుగుతున్న వివాదంలో అమెజాన్ తాజాగా నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (NCLAT)ను ఆశ్రయించింది. అమెజాన్-ఫ్యూచర్ కూపన్ల ఒప్పందాన్ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు సింగపూర్ మధ్యవర్తిత్వంపై స్టే విధిస్తూ ఇటీవల దిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును అమెజాన్ సుప్రీంకోర్టులో సవాల్ చేసినట్లు మరో అధికారి వెల్లడించారు. ఈ వ్యవహారంపై ఇటు అమెజాన్‌గానీ, సీసీఐగానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
అంతకుముందు ఏం జరిగిందంటే...
అమెజాన్, ఫ్యూచర్ కూపన్ సంస్థల మధ్య 2019లో జరిగిన ఒప్పందంలోని హక్కులను వినియోగించి ఫ్యూచర్-రిలయన్స్ ఒప్పందాన్ని అమెజాన్ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అమెజాన్-ఫ్యూచర్ కూపన్ల ఒప్పందాన్ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) డిసెంబరు 17న రద్దు చేసింది. తమ అనుమతులు కోరడానికి ముందు అమెజాన్ కొంత సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా వెల్లడించనట్లు తెలిపింది. దీంతో ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తూ, అమెజాన్‌పై రూ.202 కోట్ల అపరాధ రుసుమును సైతం సీసీఐ విధించింది. దీంతో మధ్యవర్తిత్వ ప్రక్రియ ముందుకు వెళ్లకుండా అంతర్జాతీయ మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్‌కు ఆదేశాలు జారీ చేయాలని ఫ్యూచర్ గ్రూప్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తోసిపుచ్చగా.. వెంటనే డివిజన్ బెంచ్‌కు ఫ్యూచర్ గ్రూప్ అప్పీలు చేసింది. డివిజన్ బెంచ్ ఫ్యూచర్ గ్రూప్‌నకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఫిబ్రవరి 1న పూర్తి వాదనలు వింటామని తెలిపింది. అప్పటివరకు సింగపూర్ మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్ మధ్యవర్తిత్వ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో జనవరి 5-8 మధ్య జరగాల్సిన మధ్యవర్తిత్వ ప్రక్రియను సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ నిలిపివేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక