Great Indian Festival: ఒక రోజు ముందే అమెజాన్‌ ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ విక్రయాలు

అమెజాన్‌ తమ గ్రేట్‌ ఇండియన్ ఫెస్టివల్‌ ప్రారంభ తేదీని ముందు ప్రకటించిన దానికంటే ఒకరోజు ముందు అంటే అక్టోబరు 3కు మార్చింది....

Published : 26 Sep 2021 16:31 IST

దిల్లీ ‌: ఏటా పండుగ సీజన్‌లో ప్రత్యేక విక్రయాలు చేపట్టే ఈ-కామర్స్‌ సంస్థలు.. ఈసారి నిర్వహణ తేదీల్లో పోటాపోటీగా ముందుకు సాగుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ ఏటా నిర్వహించే ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ను అక్టోబరు 7-10 తేదీల్లో నిర్వహించనున్నట్లు తొలుత ప్రకటించింది. దీంతో వినియోగదారులను ముందుగానే ఆకట్టుకునే ఎత్తుగడతో అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌’ను అక్టోబర్‌ 4న ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. దీంతో పోటీకి తెరలేచింది. 

ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్‌ అక్టోబరు 3నే బిగ్‌ బిలియన్ డేస్‌ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. దీంతో అమెజాన్‌ సైతం తమ గ్రేట్‌ ఇండియన్ ఫెస్టివల్‌ ప్రారంభ తేదీని ముందు ప్రకటించిన దానికంటే ఒకరోజు ముందు అంటే అక్టోబరు 3కు మార్చింది. చిన్న విక్రేతలు, స్థానిక దుకాణదారుల ప్రయోజనాలే తమ తొలి ప్రాధాన్యమని అమెజాన్‌ తెలిపింది. ఈ నేపథ్యంలోనే అక్టోబరు 3కు ప్రత్యేక విక్రయాల తేదీని మార్చినట్లు వెల్లడించింది. ప్రైమ్‌ కస్టమర్లు మరింత ముందుగానే ఆఫర్లను పొందొచ్చని తెలిపింది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన దుస్తుల ఈ-కామర్స్‌ సంస్థ మింత్రా సైతం అక్టోబరు 3-10 తేదీల్లో బిగ్‌ ఫ్యాషన్‌ ఫెస్టివల్‌ పేరుతో ప్రత్యేకంగా విక్రయాలు చేయనున్నట్లు ప్రకటించింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts