Amazon Prime day Sale: అమెజాన్   ప్రైమ్‌ మెంబర్లకు ప్రత్యేక ఆఫర్లు!

ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వార్షిక ‘ప్రైమ్‌ డే సేల్‌’లో భాగంగా సరికొత్త ఆఫర్లను ముందుకు తీసుకొస్తోంది. జులై 26 నుంచి రెండు రోజుల పాటు ఈ సేల్‌ జరగనుంది. స్మార్ట్‌ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు సహా అనేక ఎలక్ట్రానిక.......

Updated : 24 Jul 2021 21:48 IST

దిల్లీ: ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వార్షిక ‘ప్రైమ్‌ డే సేల్‌’లో భాగంగా సరికొత్త ఆఫర్లను ముందుకు తీసుకొస్తోంది. జులై 26 నుంచి రెండు రోజుల పాటు ఈ సేల్‌ జరగనుంది. స్మార్ట్‌ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు సహా అనేక ఎలక్ట్రానిక్ వస్తువులపై డిస్కౌంట్లు ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో కలిసి 10 శాతం రాయితీ కల్పించనుంది. ఇక ఈసారి ‘అడ్వాంటేజ్‌-జస్ట్‌ ఫర్‌ ప్రైమ్‌’ పేరిట ప్రైమ్‌ ఖాతాదారులకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది.

‘అడ్వాంటేజ్‌-జస్ట్‌ ఫర్‌ ప్రైమ్‌ ప్రోగ్రాం’ కింద హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌, డెబిట్‌ కార్డు కలిగిన వారు తక్కువ వడ్డీరేటు, ఎక్కువ ఈఎంఐలతో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే ఆరు నెలల పాటు ఉచితంగా స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ కూడా అందిస్తోంది. సాధారణంగా స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌కు ఫోన్‌ ధరలో 40 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుంది.

కొత్తగా ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకునేవారికి సైతం అమెజాన్ ఆఫర్లు ప్రకటించింది. సంవత్సరానికి రూ.999, మూడు నెలలకు రూ.329గా సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలను నిర్ణయించింది. ఇక 18-24 ఏళ్ల యువకులకు ‘యూత్‌ ఆఫర్‌’ కింద సబ్‌స్క్రిప్షన్‌ ధరలో 50 శాతం డిస్కౌంట్‌ ఇస్తోంది. ప్రైమ్‌కు సైన్‌ అప్‌ అయిన తర్వాత వయసును ధ్రువీకరించి వెంటనే 50 శాతం క్యాష్‌బ్యాక్‌ పొందడం ద్వారా ఈ ఆఫర్‌ను సొంతం చేసుకుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని