Amazon: అమెజాన్‌ వశమైన ప్రయోన్‌.. తప్పుకున్న నారాయణమూర్తి ‘కాటమరాన్‌’

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులు ఎన్‌ఆర్‌ నారాయణమూర్తికి చెందిన కాటమరాన్‌ వెంచర్స్‌, ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ మధ్య ఏర్పడిన సంస్థ ప్రయోన్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ ఇక పూర్తిగా అమెజాన్‌ వశం కానుంది....

Published : 22 Dec 2021 17:01 IST

దిల్లీ: ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులు ఎన్‌ఆర్‌ నారాయణమూర్తికి చెందిన కాటమరాన్‌ వెంచర్స్‌, ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌లు సంయుక్తంగా ఏర్పాటుచేసిన సంస్థ ప్రయోన్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ ఇక పూర్తిగా అమెజాన్‌ వశం కానుంది. కాటమరాన్‌కు ప్రయోన్‌లో ఉన్న వాటాల్ని పూర్తిగా కొనుగోలు చేయనున్నట్లు అమెజాన్‌ బుధవారం ప్రకటించింది. దీని వెనుక కారణాన్ని మాత్రం బయటపెట్టలేదు.

అయితే, నారాయణమూర్తి ఆగస్టులోనే దీనికి సంబంధించిన ఓ ప్రకటన చేశారు. ఇరు సంస్థలు ఇకపై జాయింట్‌ వెంచర్‌గా కొనసాగబోవని అప్పట్లో ప్రకటించారు. నియంత్రణా సంస్థల అనుమతి లభిస్తే ఇక ప్రయోన్‌ పూర్తిగా అమెజాన్‌ చేతిలోకి వెళ్లనుంది. యాజమాన్యంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదు. ప్రయోన్‌ను 2014లో ప్రారంభించారు. అయితే, ఈ-కామర్స్‌ సంస్థలు తమ సొంత ఉత్పత్తులను విక్రయించడానికి వీల్లేదని ప్రభుత్వం 2018లో షరతు విధించింది. దీంతో ప్రయోన్‌ను పునర్‌వ్యవస్థీకరించాల్సి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని