సుప్రీం కోర్టుకు అమెజాన్‌

రిలయన్స్‌ రిటైల్‌తో ఫ్యూచర్‌ గ్రూప్‌ కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల ఒప్పందాన్ని అడ్డుకునేందుకు ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఒప్పందంపై యథాపూర్వ

Published : 12 Feb 2021 00:48 IST

ఫ్యూచర్‌-రిలయన్స్‌ ఒప్పంద వివాదం

దిల్లీ: రిలయన్స్‌ రిటైల్‌తో ఫ్యూచర్‌ గ్రూప్‌ కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల ఒప్పందాన్ని అడ్డుకునేందుకు ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఒప్పందంపై యథాపూర్వ స్థితి కొనసాగించాలంటూ అంతక్రితం ఇచ్చిన ఆదేశాలపై దిల్లీ హై కోర్టు స్టే ఇచ్చిన అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది. అమెజాన్‌, ఫ్యూచర్‌ గ్రూప్‌లు ఈ విషయంపై ఇంకా స్పందించలేదు. సీసీఐ, సెబీ, స్టాక్‌ఎక్స్ఛేంజీల నుంచి ఫ్యూచర్‌-రిలయన్స్‌ ఒప్పందానికి అనుమతులు దక్కిన సంగతి తెలిసిందే. రిలయన్స్‌తో ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లరాదంటూ సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌(ఎస్‌ఐఏసీ)లో ఎమర్జెన్సీ ఆర్బిట్రేటర్‌(ఈఏ) ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అమలు పరచాలంటూ అమెజాన్‌ గత నెలలో దిల్లీ హై కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని