Updated : 27 Aug 2021 15:26 IST

Ami Organics IPO: 1న ‘అమీ ఆర్గానిక్స్’ ఐపీఓ.. షేరు ధర ఎంతంటే?

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్పెషాలిటీ కెమిక‌ల్స్ త‌యారీదారు ‘అమీ ఆర్గానిక్స్ లిమిటెడ్‌’ ఐపీఓ సెప్టెంబ‌ర్ 1న ప్రారంభ‌ం కానుంది. సెప్టెంబ‌ర్ 3న ముగుస్తుంది. ఒక్కో షేర్ ధ‌ర‌ను రూ. 603-610గా నిర్ణ‌యించింది. ఈ ఇష్యూ ద్వారా వ‌చ్చిన ఆదాయాన్ని రూ.140 కోట్ల వ‌ర‌కు ఆర్థిక స‌దుపాయాల రీపేమెంట్ కోసం ఉప‌యోగించాల‌ని కంపెనీ యోచిస్తోంది. సంస్థ వ‌ర్కింగ్ క్యాపిట‌ల్ అవ‌స‌రాల‌కు రూ. 90 కోట్ల వ‌ర‌కు ఉప‌యోగిస్తారు. మార్చి 2021 నాటికి సంస్థ నిక‌ర రుణం రూ.218.73 కోట్లుగా ఉంది. ఈ ఆర్ధిక సంవ‌త్స‌రంలో సంస్థ ఆదాయం రూ.340.61 కోట్లుగా ఉంది. గ‌తేడాది ఈ ఆదాయం రూ.239.64 కోట్లు. ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో సంస్థ నిక‌ర ఆదాయం రూ.53.99 కోట్లు కాగా... గ‌తేడాది ఈ నిక‌ర ఆదాయం రూ.27.47 కోట్లు మాత్రమే.

ఈ ఇష్యూలో ప్ర‌స్తుత ప్ర‌మోట‌ర్ల‌, వాటాదారులు రూ.200 కోట్ల విలువైన 6.06 మిలియ‌న్ షేర్లను ఆఫ‌ర్ ఫ‌ర్ సేల్ కింద విక్రయించనున్నారు. సుమారు రూ.570 కోట్లు స‌మీక‌రించాల‌ని కంపెనీ యోచిస్తోంది. రూ.100 కోట్ల వ‌ర‌కు ప్రీ-ఐపీఓ ప్లేస్‌మెంట్ కోసం త‌న బుక్ ర‌న్నింగ్ మేనేజ‌ర్‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు సంస్థ తెలిపింది. ఇంటెన్సివ్ ఫిస్క‌ల్ స‌ర్వీసెస్ ప్రై. లిమిటెడ్‌, యాంబిట్‌ ప్రైవేట్ లిమిటెడ్‌, యాక్సెస్ క్యాపిట‌ల్ లిమిటెడ్ ఈ ఇష్యూకి బుక్ ర‌న్నింగ్ లీడ్ మేనేజ‌ర్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి.

‘అమీ ఆర్గానిక్స్‌’ విభిన్న‌మైన ర‌సాయ‌నాల త‌యారీలో పేరుమోసిన సంస్థ‌. రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్‌లో సంస్థ‌కు ప్ర‌త్యేక‌త ఉంది. ప్ర‌త్యేక ర‌సాయ‌నాల త‌యారీయే కాకుండా అడ్వాన్స్‌డ్ ఫార్మాస్యూటికల్స్, జ‌న‌రిక్ మెడిసిన్ అభివృద్ధిలో ముందుంది. వ్య‌వ‌సాయ ర‌సాయ‌నాలు, సూక్ష్మ ర‌సాయ‌నాల రీసెర్చ్ అభివృద్ధి త‌యారీపై సంస్థ దృష్టి సారించింది. సంస్థ 17కి పైగా చికిత్సా కేంద్రాల‌లో 450కి పైగా ఫార్మా ఇంట‌ర్మీడియ‌ట్‌ల‌ను వాణిజ్య‌ప‌రంగా అభివృద్ధి చేసింది. గ్లోబ‌ల్ మార్కెట్ కోసం యాంటీ-రెట్రో వైర‌ల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేట‌రీ, యాంటీ సైకోటిక్ వంటి ఫార్మాస్యూటిక‌ల్స్ అభివృద్ధిపై దృష్టి సారించింది.

దేశీయ మార్కెట్‌తో పాటు యూర‌ప్‌, చైనా, జ‌పాన్‌, ఇజ్రాయెల్‌, యూఎస్‌, యూకే, లాటిన్ అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల మార్కెట్ల‌కు అవ‌స‌రాలు తీర్చ‌గ‌ల వివిధ బ‌హుళ‌-జాతీయ కంపెనీల ఔష‌ధ కంపెనీల‌కు ఏపీఐలు, ఎన్‌సీఈల త‌యారీకి ఉప‌యోగించే ఫార్మా ఇంట‌ర్మీడియ‌ట్‌ల‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లు సంస్థ తెలిపింది.

ఈ ఐపీవోకి సంబంధించిన కీలక విషయాలు...

ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభ తేదీ: సెప్టెంబరు 1, 2021

ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌ ముగింపు తేదీ: సెప్టెంబరు 3, 2021

బేసిస్‌ ఆఫ్‌ అలాట్‌మెంట్‌ తేదీ: సెప్టెంబరు 8, 2021

రీఫండ్‌ ప్రారంభ తేదీ: సెప్టెంబరు 9, 2021

డీమ్యాట్‌ ఖాతాకు షేర్ల బదిలీ తేదీ: సెప్టెంబరు 13, 2021

మార్కెట్‌లో లిస్టయ్యే తేదీ: సెప్టెంబరు 14, 2021

ముఖ విలువ: రూ.10 (ఒక్కో ఈక్విటీ షేరుకు)

లాట్‌ సైజు: 24 షేర్లు

కనీసం ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు: 24 షేర్లు(ఒక లాట్‌)

గరిష్ఠంగా ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు: 312 (13 లాట్లు)

ఐపీవో ధర శ్రేణి: రూ.603-610 (ఒక్కో ఈక్విటీ షేరుకు)

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని