మౌలిక ప్రాజెక్టులపై రూ.4.28 లక్షల కోట్ల అదనపు భారం

రూ.150 కోట్లు అంత కంటే ఎక్కువ వ్యయంతో నిర్మితమవుతున్న 450 మౌలిక ప్రాజెక్టుల పనులు ఆలస్యం కావడంతో, వాటిపై రూ.4.28 లక్షల కోట్ల అదనపు భారం పడుతోందని గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది.

Published : 27 Jan 2021 01:42 IST

దిల్లీ: రూ.150 కోట్లు అంత కంటే ఎక్కువ వ్యయంతో నిర్మితమవుతున్న 450 మౌలిక ప్రాజెక్టుల పనులు ఆలస్యం కావడంతో, వాటిపై రూ.4.28 లక్షల కోట్ల అదనపు భారం పడుతోందని గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది. మొత్తం 1,687 ప్రాజెక్టుల్లో 450 నిర్మాణాలపై అదనపు భారం పడుతుండగా, 558 మాత్రం ఆలస్యమవుతున్నాయని పేర్కొంది. ‘తొలుత మొత్తం ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం రూ.21,44,627.66 కోట్లుగా అంచనా వేయగా, తాజాగా అది రూ.25,72,670.28 కోట్లకు చేరింది. అంటే రూ.4,28,042.62 కోట్లు (19.96 శాతం అధికం) అదనంగా పెరుగుతోంద’ని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2020 డిసెంబరు నాటికి ఈ ప్రాజెక్టులపై రూ.12,17,692.37 కోట్లు (47.33 శాతం) వ్యయం చేసినట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని