డబ్బులెలా ఖర్చుపెట్టొద్దో చెప్పిన ఆనంద్‌ మహీంద్రా!

ట్రెండింగ్‌ అంశాలతో నిత్యం సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా.. తాజాగా ప్రజలకు ఓ పాఠం నేర్పించారు. డబ్బులు వృథాగా ఎలా ఖర్చు చేయకూడదో సొదాహరణంగా వివరించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు....

Published : 21 Jul 2021 11:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ట్రెండింగ్‌ అంశాలతో నిత్యం సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా.. తాజాగా ప్రజలకు ఓ పాఠం నేర్పించారు. డబ్బులు వృథాగా ఎలా ఖర్చు చేయకూడదో సొదాహరణంగా చూపించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే..

అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి తన ఫెరారీ కారేసుకొని వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే, దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏమిటని ఆరా తీస్తే.. అది పూర్తిగా బంగారు పూత పూసిన కారని వీడియో ద్వారా తెలుస్తోంది. ఓ ఇద్దరు వ్యక్తులు దాంట్లో కూర్చుని వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. దాన్ని చూసి చుట్టుపక్కల వారంతా ఆశ్యర్యపోతూ ఫొటోలు తీసుకుంటున్నారు. ఈ వీడియోపైన ‘ఇండియన్‌ అమెరికన్ విత్‌ ప్యూర్‌ గోల్డ్‌ ఫెరారీ కార్‌’ అని నోట్‌ రాసి ఉంది.

దీనిపై ఆనంద్‌ మహీంద్రా తన ట్విటర్‌లో అసంతృప్తి వ్యక్తం చేశారు. డబ్బులు ఎలా ఖర్చు పెట్టకూడదో ఈ వీడియో చూసి తెలుసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ‘‘ఇది సామాజిక మాధ్యమాల్లో ఎందుకు చక్కర్లు కొడుతుందో నాకర్థం కావడం లేదు. మనం ధనవంతులమైనంత మాత్రాన డబ్బులు ఎలా ఖర్చు పెట్టకూడదో దీని ద్వారా మనం పాఠం నేర్చుకోవచ్చు. అందుకు తప్ప.. ఇంకా ఏ విషయంలో ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిందో?’’ అని ఆయన ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. ఈ పోస్టును 24 గంటల్లో 1,69,300 మంది వీక్షించారు. వీరిలో 6,000 మంది లైక్‌ చేశారు.


Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని