Anil Ambani: సుప్రీం కోర్టులో అనిల్‌ అంబానీకి ఊరట 

ఆర్థిక కష్టాల్లో ఉన్న అనిల్‌ అంబానీకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. దిల్లీ మెట్రో - రిలయన్స్‌ ఇన్‌ఫ్రా కేసులో నేడు సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది. 2017లో ఆర్బిట్రేషన్‌ ట్రైబ్యూనల్‌

Published : 09 Sep 2021 13:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆర్థిక కష్టాల్లో ఉన్న అనిల్‌ అంబానీకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. దిల్లీ మెట్రో - రిలయన్స్‌ ఇన్‌ఫ్రా కేసులో నేడు సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 2017లో ఆర్బిట్రేషన్‌ ట్రైబ్యూనల్‌ ఇచ్చిన తీర్పును సమర్థించింది. రిలయన్స్‌ ఇన్‌ఫ్రాకు వడ్డీతో కలిపి పరిహారం చెల్లించాలని దిల్లీ మెట్రోను ఆదేశించింది. కంపెనీ లెక్కల ప్రకారం ఇది సుమారు రూ.4,660 కోట్ల వరకు ఉంటుంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అనిల్‌ అంబానీ సంస్థలకు ఈ తీర్పు భారీ ఊరటనిచ్చినట్లయింది. ఈ తీర్పు నేపథ్యంలో రిలయన్స్‌ ఇన్‌ఫ్రా షేరు దాదాపు 5శాతం లాభపడింది. 

రిలయన్స్‌ ఇన్ఫ్రాకు చెందిన ఒక విభాగం 2008లో దేశంలోనే తొలి ప్రైవేటు రైలు సేవలు అందించేందుకు ఒప్పందం చేసుకొంది. కానీ ఫీజు, నిర్వహణ అంశాల్లో వివాదం చెలరేగడంతో 2012లో కాంట్రాక్టు నుంచి బయటకు వచ్చేసింది. పరిహారం కోసం దిల్లీ మెట్రోపై ఆర్బిట్రేషన్‌ కేసు దాఖలు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని