వార్షిక ఆదాయమే..కీల‌కం

ట‌ర్మ్ ఇన్సురెన్స్ పాల‌సీ కొనుగోలు చేసేప్పుడు, మీ వార్షిక ఆదాయాన్ని దర‌ఖాస్తు ఫారంలో తెలియ‌జేయాల‌ని తెలుసా?  

Updated : 08 Apr 2021 12:51 IST

ట‌ర్మ్ పాల‌సీ కొనుగోలు స‌మ‌యంలో వార్షిక ఇన్‌క‌మ్ ఫ్రూఫ్.. త‌ప్ప‌నిస‌రిగా బీమా సంస్థ‌లు కోర‌తాయి. ఆన్‌లైన్లోనే కాకుండా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసిన పాల‌సీల‌కు ఇన‌కమ్ ఫ్రూఫ్ ఇవ్వాల్సిందే. ఒక వ్య‌క్తికి ఎంత వ‌ర‌కు బీమా ఇవ్వ‌చ్చు అనే అంశాన్ని వార్షిక‌ ఆదాయం ఆధారంగానే నిర్ణ‌యిస్తాయి బీమా సంస్థ‌లు. అందువ‌ల్ల పాల‌సీ కొనుగోలు చేసేవారు ఇన్‌క‌మ్ ఫ్రూవ్ సిద్దంగా ఉంచుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. 

ఎందుకు చెప్పాలి?

కుటుంబంలో సంపాదించే వ్య‌క్తి మ‌ర‌ణించిన‌ప్పుడు, ఆ స్థానంలో కుటుంబానికి అండంగా ఉండేదే ట‌ర్మ్‌బీమా. అందువ‌ల్ల ఎంత ఆదాయం ఉంటుందో తెలిస్తే, ఎంత క‌వ‌రేజ్ ఇస్తే ప్ర‌యోజ‌క‌రంగా ఉంటుందో తెలుస్తుంది. కాబ‌ట్టి వార్షిక ఆదాయం గురించి బీమా సంస్థ‌ల‌కు త‌ప్ప‌నిస‌రిగా తెలియ‌ప‌ర‌చాలి. 

బీమా చేసిన వారు ప్రీమియంల‌ను స‌కాలంలో చెల్లించ‌డం చాలా ముఖ్యం. అప్పుడే పాల‌సీలో ఉన్న అన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌గ‌లుగుతారు. మీరు స‌మ‌యానికి ప్రీమియంలు చెల్లిచ‌గ‌లుగుతారా.. లేదా.. అనే విష‌యాల‌న్ని మీ సంపాద‌న సామ‌ర్ధ్యం, ఆర్థిక ఆదాయాల ద్వారా బీమా సంస్థ అంచ‌నా వేస్తుంది. 

ఎన్ని సంవ‌త్స‌రాల నుంచి ప‌నిచేస్తున్నారు, ఉద్యోగ హోదా వంటి ఇత‌ర వివ‌రాలు కూడా తెలిజేయాల్సి ఉంటుంది. ప్ర‌త్యేకించి ఎక్కువ రిస్క్ ఉన్న చోట విధుల‌ను నిర్వ‌హించే వారు, సీనియారిటీ, అనుభ‌వం, ఎంత శాతం రిస్క్ ఉంటుంది అనే వివ‌రాల‌ను  తెలపాలి.  వీటి ఆధారంగా కూడా ఎంత బీమా అవ‌సరమో లెక్కిస్తారు. 

ఆదాయ ఫ్రూఫ్ ఎందుకు ఇవ్వాలి?

హామీ మొత్తం లేదా మీకు అందించే మొత్తం జీవిత కవరేజీని నిర్ణయించడంలో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్(ఆర్థిక నివేదిక‌లు) సహాయపడుతాయి. అంతేకాకుండా అధిక బీమా అవకాశాన్ని నివారిస్తాయి. పాలసీదారుడు అసలు నగదు విలువ కంటే ఎక్కువ కవరేజీని కొనుగోలు చేస్తే, అది బీమా సంస్థకు ప్రమాదం కావచ్చు. 

అందువ‌ల్ల ఆదాయ ప్రకటనలో వ్యత్యాసం ఉండ‌కూడ‌దు. అంటే ద‌ర‌ఖాస్తు ఫారంలో తెలియ‌జేసిన ఆదాయం, ఇన్‌క‌మ్ ఫ్రూఫ్‌లో ఉన్న ఆదాయాలు వేరువేరుగా ఉండ‌కూడ‌దు. ఒక‌వేళ ఉంటే  బీమా సంస్థ‌ క్లెయిమ్‌ల‌ను తిరస్కరిస్తుంది. భ‌విష్య‌త్తులో అంటే క్లెయిమ్ చేసే స‌మ‌యంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే, బీమా కొనుగోలు స‌మ‌యంలోనే ఇన్‌క‌మ్ ఫ్రూవ్ ఇవ్వ‌డం మంచిది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని