ప‌ద‌వీవిర‌మ‌ణ నిధి కోసం యాన్యూటీలు స‌రైన ఎంపికేనా?

ప‌ద‌వీవిర‌మ‌ణ చేసిన త‌రువాత నెల‌నెలా కొంత స్థిర‌మైన మొత్తాన్ని అందుకునేందుకు ఉద్దేశించిన‌వి యాన్యూటీ పాల‌సీలు

Published : 29 Jan 2021 15:00 IST

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌రువాత ఒక క్ర‌మ‌మైన ఆదాయం కోసం చాలా కాలంగా యాన్యూటీల‌ను మార్గంగా సూచిస్తున్నారు. ప‌ద‌వీ విర‌మ‌ణ ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు, ఒక క్ర‌మ‌మైన ఆదాయాన్ని పొందేందుకు వీలుగా యాన్యూటీలు రూపొందించారు. అయితే యాన్యూటీలు స‌రైన విధంగా ప‌నిచేస్తాయా? లేదా అనేది తెలుసుకుందాం.

యాన్యూటీలు ఎలా ప‌నిచేస్తాయి?
ప్రీమియం మొత్తం ఒకేసారి లేదా స‌మ‌యానికి త‌గిన‌ట్లుగా, క్ర‌మానుగ‌తంగా చెల్లించే విధంగా యాన్యూటీల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. కొనుగోలు చేసే వ్య‌క్తి మ‌ర‌ణం వ‌ర‌కు లేదా వారి జీవిత భాగ‌స్వామి జీవించి ఉన్నంత‌ కాలం పొందే విధంగా ఆప్ష‌న్ల‌ను ఎంచుకోవ‌చ్చ‌ని, పీఎన్‌బీ మెట్‌లైఫ్ ఇండియా ఇన్సురెన్స్ కో లిమిటెడ్ ప్రొడ‌క్ట్ హెడ్‌ మోహిత్ గార్గ్ తెలిపారు. యాన్యూటీ ప్లాన్లు ఫైనాన్షియ‌ల్ రిస్క్‌ను క‌వ‌ర్ చేస్తూ, సుదీర్ఘ‌మైన, సౌక‌ర్య‌వంత‌మైన జీవన శైలికి త‌గిన విధంగా ఆదాయాన్ని అందిస్తాయి.

ప్ర‌ధానంగా రెండు ర‌కాలైన యాన్యూటీ ప్రాడెక్టులు అందుబాటులో ఉన్నాయి.
1.ఇమ్మిడీయ‌ట్ పింఛ‌ను ప్లాన్లు: ఒకేసారి ప్రీమియం చెల్లించి పాల‌సీని కొనుగోలు చేసిన వెంట‌నే కాలానుగుణంగా ఫించ‌ను చెల్లించ‌డం ప్రారంభిస్తారు.
2.డిఫ‌ర్డ్ పింఛ‌ను ప్లాన్లు: ఇందులో ఎక్యూమిలేట్ ద‌శ ఉంటుంది. మీరు చెల్లించే ప్రీమియంతో కార్ప‌స్‌ను వృద్ధిచేస్తారు. ఎక్యూమిలేట‌డ్ ద‌శ పూర్తైన అనంత‌రం పింఛ‌ను చెల్లించ‌డం ప్రారంభిస్తారు. యాన్యుటీ రేటును ముందుగా హామీ ఇవ్వ‌చ్చు లేదా వార్షిక చెల్లింపు దశలో నిర్ణయించవచ్చు.

బీమా నియంత్ర‌ణ సంస్థ ఇటీవ‌లె యాన్యూటీల‌లో విత్‌డ్రా లిమిట్‌ను పెంచింది. ప్ర‌స్తుతం ఫించ‌ను సాధ‌నాల‌లో 60 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. మిగిలిన భాగాన్ని యాన్యూటీ ప్రాడెక్టులు కొనుగోలు చేసేందుకు ఉప‌యోగించాలి. ఇంత‌కు ముందు మ‌దుప‌ర్లు 1/3వ వంతు మాత్ర‌మే విత్‌డ్రా చేసుకునేందుకు అవ‌కాశం ఉండేది. బీమా సంస్థ‌పై ఆధార‌ప‌డి యాన్యూటీ ఉత్ప‌త్తుల‌లో పెట్టుబ‌డి పెట్టే క‌నీస మొత్తం మారుతూ ఉంటుంది. ఇటీవ‌లి కాలంలో ప్ర‌వేశ‌పెట్టిన సాధ‌నాల‌లో చాలా వ‌ర‌కు సంస్థ‌లు నెల‌కు క‌నీసం రూ. 2 వేల పెట్టుబ‌డిని అనుమ‌తిస్తున్నాయి.

యాన్యూటి ప‌థ‌కాల‌లో ప్ర‌ధానంగా ఎదుర‌య్యే స‌మ‌స్య లిక్వీడిటీ లేక‌పోవ‌డం. అంతేకాకుండా యాన్యూటీ మొత్తంపై ప‌న్ను చెల్లించ‌డం అనేది చ‌ర్చ‌నీయాంశంగా ఉంది. మెచ్యూరిటీ స‌మ‌యం వ‌ర‌కు దీనిపై ఎటువంటి ప‌న్ను వ‌ర్తించ‌దు. అయితే మెచ్యూరిటీ స‌మ‌యం త‌రువాత యాన్యూటీ మొత్తం ఆదాయంగా ప‌రిగ‌ణించి ప‌న్ను విధిస్తారు.

య‌న్యూటీల‌ను ప్ర‌భుత్వ సెక్యూరిటీల‌లో మ‌దుపు చేయ‌డం వ‌ల్ల రాబ‌డి త‌క్కువ‌గా ఉంటుంది. వ‌డ్డీ రేటు సాధార‌ణంగా 7 నుంచి 8 శాతం వ‌ర‌కు ఉంటుంది.
యాన్యూటీల‌లో ఎటువంటి ఫీజులుగానీ ఛార్జీలు గానీ ఉండ‌వు. చార్జీలు రాబ‌డుల‌లో నిక్షిప్తంగా ఉంటాయి. అందువ్ల రాబ‌డి త‌క్కువ‌గా ఉంటుంది .యూనిట్ లింక్ ఫించ‌ను ప‌థ‌కాల‌లో చార్జీలు క‌నిపిస్తాయి.

అన్ని బీమా కాంట్రాక్టుల‌ మాదిరిగానే యాన్యూటీ ఉత్ప‌త్తుల‌లో కూడా బీమా సంస్థ‌లు అంత‌ర్గ‌త రుసుముల‌ను విధిస్తాయి. ఇందులో ఖ‌ర్చులు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు చెల్లించే క‌మీష‌న్‌, కాల‌ప‌రిమితి, రిస్క్ వంటివి ఉంటాయి.

మీకు స‌రిపోతుందా?

కొన్ని సందర్భాల్లో ఈ సాధ‌నాలు మీకు అంత అనుకూలంగా ఉండ‌క‌పోవ‌చ్చు. ప‌న్నులు చెల్లించిన త‌రువాత వ‌చ్చే రాబ‌డి త‌క్కువ‌గా(4.5 శాతం ప‌రిధిలో) ఉండ‌చ్చు. ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం అందుబాటులో ఉన్న ఇత‌ర ప‌థ‌కాల‌తో పోలిస్తే ఇది స‌రైన ఎంపిక కాక‌పోవ‌చ్చు. ప్ర‌స్తుతం మీ ప‌ద‌వీవిర‌మ‌ణ అవ‌స‌రాల‌కు అనుగుణంగా చాలా పెట్టుబడి సాధనాలు రూపొందిస్తున్నారు. మీరు రిస్క్ తీసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌కుండా, 6 శాతం రాబ‌డితో సంతృప్తి చెందే వారైతే మీకు యాన్యూటీలు అనుకూలంగా ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని