మరో 34 ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం: వన్‌వెబ్‌

తక్కువ కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రయోగిస్తున్న వన్‌వెబ్‌, తాజాగా మరో 34 ఉపగ్రహాలను ప్రయోగించింది. దక్షిణ కజఖ్‌స్తాన్‌లోని బైకోనుర్‌ కాస్మోడ్రోమ్‌ నుంచి ఎరైన్‌స్పైస్‌ ద్వారా వీటిని ప్రయోగించినట్లు కంపెనీ సోమవారం వెల్లడించింది. దీంతో కంపెనీ

Published : 24 Aug 2021 01:25 IST

దిల్లీ: తక్కువ కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రయోగిస్తున్న వన్‌వెబ్‌, తాజాగా మరో 34 ఉపగ్రహాలను ప్రయోగించింది. దక్షిణ కజఖ్‌స్తాన్‌లోని బైకోనుర్‌ కాస్మోడ్రోమ్‌ నుంచి ఎరైన్‌స్పైస్‌ ద్వారా వీటిని ప్రయోగించినట్లు కంపెనీ సోమవారం వెల్లడించింది. దీంతో కంపెనీ ఈ క్షక్ష్యలోకి పంపిన మొత్తం ఉపగ్రహాల సంఖ్య 288కి చేరింది. ఈ ఏడాదిలో వీటి సేవలను ప్రారంభిస్తామని, 2022లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని కంపెనీ తెలిపింది. వన్‌వెబ్‌లో భారతీ గ్రూపునకు పెట్టుబడులు ఉన్నాయి. వాణిజ్య సేవలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తమ వ్యాపార ప్రదర్శనకు తాజా పరిణామం అద్దంపడుతుందని, ప్రపంచవ్యాప్తంగా సేవల విస్తరణపై దృష్టి పెడుతున్నామని వన్‌వెబ్‌ పేర్కొంది. 2021 ప్రారంభం నుంచి వివిధ పరిశ్రమలు, వ్యాపార సంస్థల్లో డిస్ట్రిబ్యూషన్‌ భాగస్వాములను కంపెనీ ప్రకటిస్తూ వస్తోంది. తాజాగా కెనడాలో నార్త్‌వెస్టెల్‌, బ్రిటన్‌లోని బీటీతో జట్టుకట్టింది.


ఇండియా యమహా ఎమ్‌టీ-15 ప్రత్యేక ఎడిషన్‌

దిల్లీ: ఇండియా యమహా మోటార్‌ తన ఎమ్‌టీ-15 బైక్‌లో మాన్‌స్టర్‌ ఎనర్జీ యమహా మోటోజీపీ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. దీని ధరను రూ.1.48 లక్షలు(ఎక్స్‌ షోరూం, దిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. యమహా మోటోజీపీ బ్రాండింగ్‌తో వచ్చే ఈ బైక్‌కు 155 సీసీ ఫ్యూయల్‌ ఇంజెక్టెడ్‌, లిక్విడ్‌ కూల్డ్‌, 4 స్ట్రోక్‌, ఎస్‌ఓహెచ్‌సీ, 4-వాల్వ్‌ ఇంజిన్‌ అమర్చారు. పక్క స్టాండ్‌ వేసినపుడు ఇంజిన్‌ ఆఫ్‌ కావడం, సింగిల్‌-చానల్‌ ఏబీఎస్‌, వేరియబుల్‌ వాల్వ్‌ యాక్చువేషన్‌(వీవీఏ) సిస్టమ్‌, మల్టీ ఫంక్షన్‌ నెగెటివ్‌ ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, బైఫంక్షనల్‌ ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌, ఎల్‌ఈడీ టెయిల్‌ లైట్‌ తదితర ఫీచర్లు దీని సొంతం.


ఓఎల్‌ఎక్స్‌ ఆటోస్‌ రూ.7,500 కోట్ల విక్రయాలు

దిల్లీ: ఓఎల్‌ఎక్స్‌ గ్రూప్‌ తన ట్రేడింగ్‌ ప్లాట్‌ఫాం అయిన ఓఎల్‌ఎక్స్‌ ఆటోస్‌ ద్వారా 100 కోట్ల డాలర్ల(రూ.7500 కోట్లు)కు పైగా విక్రయాలను సాధించింది. ఆసియా, అమెరికాల్లోని 10 దేశాల్లో కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. నెలకు సగటున 5 లక్షల వినియోగ కార్లను విక్రయించాలని వినియోగదార్లు, డీలర్లు ఈ వెబ్‌సైట్‌ను ఆశ్రయిస్తుంటారు. జనవరి 2020లో ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి దాకా మొత్తం కార్ల లావాదేవీలు 100 కోట్ల డాలర్లను అధిగమించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని