Apple: జీరో క్లిక్‌కు యాపిల్‌ ప్యాచ్‌ విడుదల

యాపిల్‌ సంస్థ ‘జీరో క్లిక్‌’ స్పైవేర్‌ చొరబడకుండా ప్యాచ్‌ను నేడు విడుదల చేసింది. ఈ స్పైవేర్‌ ఐఫోన్స్‌, ఐపాడ్స్‌లోకి చొరబడే అవకాశం ఉండటంతో ఈ చర్యలు తీసుకొంది.

Published : 14 Sep 2021 15:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘జీరో క్లిక్‌’ స్పైవేర్‌ చొరబడకుండా యాపిల్‌ సంస్థ ప్యాచ్‌ను నేడు విడుదల చేసింది. ఈ స్పైవేర్‌ ఐఫోన్స్‌, ఐపాడ్స్‌లోకి చొరబడే అవకాశం ఉండటంతో ఈ చర్యలు తీసుకొంది. ఇప్పటికే ఈ స్పైవేర్‌ టెక్‌ దిగ్గజాల ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌లోకి చొరబడినట్లు పరిశోధకులు హెచ్చరించారు. హ్యాక్‌ చేయడానికి వీలుగా ఒక పీడీఎఫ్‌ ఫైల్‌ రూపంలో ఈ స్పైవేర్‌ వస్తుందని యాపిల్‌ పేర్కొంది.

‘యూనివర్సిటీ ఆఫ్‌ టొరెంట్‌’లోని ‘సిటిజన్స్‌ ల్యాబ్‌’ ఈ స్పైవేర్‌పై ప్రకటన చేసింది. గతంలోనే ఈ ల్యాబ్‌ జీరో క్లిక్‌ స్పైవేర్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ను గుర్తించింది. కానీ, ‘‘జీరోక్లిక్‌ సిస్టమ్‌లోకి చొరబడగా.. గుర్తించింది మాత్రం ఇప్పుడే. ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు’’ అని పేర్కొంది.  ఐఫోన్లలో స్పైవేర్‌ను చొప్పించేందుకు ఇప్పటికే ఇజ్రాయెల్‌ సంస్థ ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ కొన్ని లోపాలను గుర్తించిందన్న విషయాన్ని వెల్లడించింది. ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ తయారు చేసిన పెగసాస్‌ కూడా జీరోక్లిక్‌ స్పైవేర్‌ వలే పనిచేస్తుంది.

ఇప్పటికే యాపిల్‌ ఐఓఎస్‌ 14.8,  ఐపాడ్‌ ఓఎస్‌ 14.8 సాఫ్ట్‌వేర్‌కు ప్యాచ్‌లు విడుదల చేసినట్లు పేర్కొంది. ఓ పక్క‘కాలిఫోర్నియా స్ట్రీమింగ్‌’ పేరుతో సెప్టెంబరు 14 రాత్రి 10:30కి (భారత కాలమానం ప్రకారం) యాపిల్ కొత్త తరం ఐఫోన్ మోడల్‌ ఐఫోన్ 13తోపాటు మరికొన్ని ఉత్పత్తులను విడుదల చేయనున్నట్లు సమాచారం. అదే సమయంలో ఈ విషయం బయటకు రావడం గమనార్హం.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని