ఐఆర్‌డీఏఐలో పూర్తికాలపు సభ్యుడి నిమాయకం

బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ)లో పూర్తికాలపు సభ్యుడు (ఫైనాన్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌) నియామకం నిమిత్తం కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఫైనాన్స్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ విభాగాల్లో దాదాపు 25 ఏళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు

Published : 09 Mar 2021 00:58 IST

 దరఖాస్తులను ఆహ్వానించిన కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌: బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ)లో పూర్తికాలపు సభ్యుడు (ఫైనాన్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌) నియామకం నిమిత్తం కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఫైనాన్స్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ విభాగాల్లో దాదాపు 25 ఏళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ పదవికి అర్హులు. ఆర్‌బీఐలో సీజీఎం హోదాకు తక్కువ కాకుండా, లేదా ఇతర ఆర్థిక సంస్థలు, నియంత్రణ సంస్థల్లో తత్సమాన హోదాలో పనిచేసి ఉండాలి. వయసు 60 ఏళ్లకు మించరాదు. ఆసక్తికల అభ్యర్ధులు వచ్చే నెల 4వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం ఫైనాన్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సభ్యుడైన ప్రవీణ్‌ కుటుంబే పదవీకాలం ఈ నెల 12వ తేదీతో ముగుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని