నియామకాలు స్తబ్దుగానే
దేశీయంగా విద్య, స్థిరాస్తి, బీమా రంగాల్లో నియామకాలు పెరుగుతున్నాయని నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ చెబుతోంది. మొత్తం మీద చూస్తే మాత్రం ఉద్యోగ నియమాకాలు 2020 డిసెంబరు స్థాయిలోనే ఈ ఏడాది జనవరిలోనూ....
విద్య, బీఎఫ్ఎస్ఐ, స్థిరాస్తి రంగాల్లో వృద్ధి
నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్
ముంబయి: దేశీయంగా విద్య, స్థిరాస్తి, బీమా రంగాల్లో నియామకాలు పెరుగుతున్నాయని నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ చెబుతోంది. మొత్తం మీద చూస్తే మాత్రం ఉద్యోగ నియమాకాలు 2020 డిసెంబరు స్థాయిలోనే ఈ ఏడాది జనవరిలోనూ ఉన్నాయని తెలిపింది. వాహన, ఫార్మా వంటి రంగాల్లో ప్రతికూల వృద్ధి నమోదు కావడం ఇందుకు నేపథ్యం. 2021 జనవరిలో మొత్తం 1925 లిస్టింగ్‌లు రాగా.. 2020 డిసెంబరులో 1972గా ఉన్నాయి. 2020 జనవరితో పోల్చితే, గత నెలలో నియామకాలు 19 శాతం తగ్గాయి.
* డిసెంబరుతో పోలిస్తే జనవరిలో విద్య, బోధనా రంగాల్లో 11 శాతం; బీమాలో 8% పైగా; స్థిరాస్తిలో 13%, రిటైల్ 7%, బీఎఫ్ఎస్ఐ 5%, బీపీఓ/ఐటీఈఎస్ 3% మేర నియామకాలు పెరిగాయి. వాహన/అనుబంధ రంగాల్లో 14%, టెలికాంలో 8% చొప్పున తగ్గాయి.
* 2020 జనవరితో పోలిస్తే ఫార్మా, బయోటెక్‌లో 9%; ఆతిథ్య రంగంలో 61% మేర నియమాకాలు క్షీణించాయి. బీఎఫ్ఎస్ఐ 29%, బీమా 23% మేర ఉద్యోగాలు తగ్గాయి.
* ప్రారంభ స్థాయి (0-3 ఏళ్ల అనుభవం)లో 26% మేర; 13 ఏళ్లకు పైన అనుభవం ఉన్న వారికి 9% మేర నియామకాలు తగ్గాయి.
* ద్వితీయ శ్రేణి నగరాలైన వడోదరాలో 9%; చండీగఢ్‌లో 8%, జయపురలో 6% చొప్పున వృద్ధి లభిస్తే, మెట్రో నగరాల్లో నియామకాలు తగ్గాయి.
ఐటీ నియామకాలు హైదరాబాద్‌లో భేష్: ఐటీ నియామకాలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి మహా నగరాల్లో మెరుగ్గా ఉన్నాయని మాన్స్టర్ డాట్ కామ్ పేర్కొంది. కొవిడ్ ప్రభావం నుంచి కోలుకోవడమే కాక 2020 జనవరితో పోలిస్తే, గత నెలలో బెంగళూరులో 3 అఆతం, పుణెలో 2 శాతం, హైదరాబాద్‌లో 1 శాతం వృద్ధితో నియామకాలు జరుగుతున్నట్లు తెలిపింది. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లో నియామకాలు డిసెంబరుతో పోలిస్తే 10 శాతం వరకు పెరిగాయని వివరించింది. దిల్లీ-ఎన్సీఆర్లో 6 శాతం, ముంబయిలో 15 శాతం వరకు తగ్గాయని వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే