వ్య‌క్తిగ‌త రుణాల కోసం దాఖ‌లు చేసుకుంటున్నారా?

వ్య‌క్తిగ‌త రుణాలు త్వ‌ర‌గా ల‌భిస్తాయి. అవ‌స‌రానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి

Published : 30 Mar 2021 12:35 IST

అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో డ‌బ్బు అవ‌స‌ర‌మైన‌ప్పుడు, వేరే దారి లేన‌ప్పుడు స్వ‌ల్ప‌కాలీక వ్య‌క్తిగ‌త రుణాలు తోడ్ప‌డ‌తాయి. ఈ రుణాల‌పై బ్యాంకులు వ‌డ్డీ రూపంలో భారీ ఆదాయాన్ని పొందుతాయి. అందుకే బ్యాంకులు త‌మ వినియోగ‌దారుల‌కు ముందుగా ఆమోదించిన రుణాల‌ను కూడా అంద‌జేస్తాయి. అయితే రుణం ల‌భిస్తుంది కదా అని అవ‌స‌రం లేకున్నా తీసుకోవ‌డం మంచిది కాదు. త‌ప్ప‌నిస‌రిగా అవ‌స‌ర‌ముంటేనే అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో తీసుకుంటే మేలు.

ఏ సంద‌ర్భాల్లో వ్య‌క్తిగ‌త‌ రుణం తీసుకుంటే ప్ర‌యోజ‌నం ఉంటుందో తెలుసుకోండి..

విద్య‌:

దేశంలో ఉన్న‌త విద్య‌కు రోజు రోజుకు పెరిగిపోతున్న ఖ‌ర్చుల‌తో నాణ్య‌మైన విద్య పూర్తి చేయ‌డం చాలా ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని. ఆర్థికంగా చాలా క‌ష్ట‌మైన ప‌ని కావొచ్చు. అలాంట‌ప్పుడు మీరు వ్య‌క్తిగ‌త రుణం తీసుకునేందుకు అర్హులైతే ట్యూష‌న్ ఫీజు వంటి వాటికి రుణం తీసుకోవ‌డంలో త‌ప్పేంలేదు. అయితే ఇలాంటి స‌మ‌యాల్లో వ్య‌క్తిగ‌త రుణాల కంటే విద్యారుణాలు తీసుకోవ‌డం మంచిది. విద్యారుణాల్లో త‌క్కువ వ‌డ్డీ రేటుకు ల‌భించే రుణాల‌ను ఎంచుకోవాలి.

వైద్య చికిత్స‌:

అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో వైద్యం తీసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డిన‌పుడు వ్య‌క్తిగ‌త రుణాలు తీసుకోవ‌చ్చు. రుణానికి దాఖ‌లు చేసే ముందు మీ ఖాతాలో ఎన్ని రోజుల‌కు డిపాజిట్ అవుతుందో తెలుసుకోవాలి. అత్య‌వ‌స‌రంగా డ‌బ్బు అవ‌స‌రం ఉన్న‌ప్పుడు ఈ రుణాలు ల‌భిస్తే ప్ర‌యోజ‌నం ఉంటుంది.

రుణ స‌మీక‌ర‌ణ‌:

మీరు ఒకేసారి నాలుగైదు క్రెడిట్ కార్డులు క‌లిగి ఉంటే భారీగా రుణాల్లో ప‌డే అవ‌కాశ‌ముంటుంది. అది మీకు రెండు ర‌కాలుగా చెడు చేస్తుంది. సిబిల్ స్కోర్ త‌గ్గిపోవ‌డంతోపాటు, రుణం తిరిగి పొందేందుకు అవ‌కాశాలు త‌గ్గిపోతాయి. అయితే దీనికోసం స‌రిప‌డా రుణం తీసుకొని అన్ని కార్డుల వాయిదాలు చెల్లించాలి. అప్పుడు ఉన్న ఒకే అప్పు చెల్లించ‌డం సుల‌భ‌మ‌వుతుంది.

కార‌ణం లేకుండా తీసుకోవ‌ద్దు:

ఒక చిరువ్యాపారం మొద‌లుపెట్టాల‌నుకుంటున్నారు. అప్పుడు స్నేహితులు లేదా బందువుల వ‌ద్ద రుణం తీసుకోవ‌డం మంచిది. ఇత‌రుల పేరుతో రుణాలు తీసుకోవ‌డం కానీ, ఇత‌రులు తీసుకునే రుణాల‌కు హామీనివ్వ‌డం వంటివి చేయ‌కూడ‌దు. స్టాక్ మార్కెట్లో పెట్టుబ‌డులు పెట్టేందుకు కూడా రుణం తీసుకోవ‌డం మంచి విష‌యం కాదు. ఇందులో రిస్క్ పెరిగి స‌మ‌స్య‌లు ఎక్కువ‌య్యే అవ‌కాశం ఉంటుంది. ఎప్పుడైనా రుణం తీసుకునే ముందు అర్హ‌త‌కి ముందు నిజంగా అవ‌స‌రం ఉందా లేదా అన్న‌ది చెక్ చేసుకోవాలి. బ్యాంకులు త‌క్కువ వ‌డ్డీకే రుణాలు ఆఫ‌ర్ చేసిప్ప‌టికీ అత్య‌వ‌స‌ర‌ముంటే త‌ప్ప రుణాలు తీసుకోక‌పోవ‌డం శ్రేయ‌స్క‌రం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని