వైమానిక దళానికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు
భారత వైమానిక దళానికి తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాల (ఎల్బీపీవీ) మొదటి విడత సరఫరా పూర్తి చేశామని అశోక్ లేలాండ్ తెలిపింది. లాక్‌హీడ్ మార్టిన్‌కు చెందిన సీవీఎన్జీ (కామన్ వెహికల్ నెక్ట్స్‌జెన్) వెర్షన్ ఆధారంగా తయారుచేసిన ఈ అధునాత.........
మొదటి విడత డెలివరీ పూర్తి: అశోక్ లేలాండ్
దిల్లీ: భారత వైమానిక దళానికి తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాల (ఎల్బీపీవీ) మొదటి విడత సరఫరా పూర్తి చేశామని అశోక్ లేలాండ్ తెలిపింది. లాక్‌హీడ్ మార్టిన్‌కు చెందిన సీవీఎన్జీ (కామన్ వెహికల్ నెక్ట్స్‌జెన్) వెర్షన్ ఆధారంగా తయారుచేసిన ఈ అధునాతన వాహనాలను 13న అందజేశామని ఎక్స్ఛేంజీలకు కంపెనీ తెలియజేసింది. లాక్‌హీడ్ మార్టిన్ నుంచి అశోక్ లేలాండ్‌కు సాంకేతిక బదలాయింపుతో ఈ వాహనాలను అభివృద్ధి చేశామని, భారత్‌లోనే పూర్తిగా వీటిని తయారు చేశామని పేర్కొంది. బురద, ఇసుక, రాళ్లు ఉన్న రహదారులతో పాటు తక్కువ లోతున్న నీళ్లపైనా ఈ ఎల్బీపీవీలు సునాయాసంగా వెళ్లగలవు. ఇందులో ఆరుగురు ప్రయాణం చేసేందుకు వీలుండటంతో పాటు సామగ్రి పెట్టుకునేందుకు తగినంత స్థలమూ ఉంటుంది. తుపాకి గుళ్ల దాడి నుంచే కాదు బాంబు పేలుళ్ల నుంచి కూడా ఇవి రక్షణ కల్పిస్తాయి. ‘సైనిక దళాలకు వాహనాలను సరఫరా చేయడాన్ని ఎంతో గర్వించదగిన విషయంగా మేం భావిస్తున్నాం. వాహనాల సరఫరా ద్వారా దేశానికి మా వంతు సేవను అందించే అవకాశం రావడం ఆనందంగా ఉంద’ని అశోక్ లేలాండ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ విపిన్ సోంది అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్‌కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి