14 వీల్స్‌తో అశోక్‌ లేల్యాండ్‌ కొత్త ట్రక్కు

ట్రక్కుల తయారీ కంపెనీ అశోక్‌ లేల్యాండ్‌ నేడు మార్కెట్లోకి సరికొత్త వాహనాన్ని విడుదల చేసింది. 4యాక్సిల్స్‌తో 14చక్రాలపై నడిచే ఏవీటీఆర్‌ 4120ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ

Published : 26 Mar 2021 16:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ట్రక్కుల తయారీ కంపెనీ అశోక్‌ లేల్యాండ్‌ శుక్రవారం మార్కెట్లోకి సరికొత్త వాహనాన్ని విడుదల చేసింది. 4 యాక్సిల్స్‌తో 14 చక్రాలపై నడిచే ఏవీటీఆర్‌ 4120ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ట్రక్‌ 40.5 టన్నుల సరకులు మోయగలదు. ఈ కంపెనీ ఉత్పత్తి చేసే స్టాండర్డ్‌ ట్రక్కులతో పోలిస్తే ఇది 5 టన్నులు ఎక్కువ. ఈ సందర్భంగా అశోక్‌ లేల్యాండ్‌ ఎండీ విపిన్‌ సోంధీ మాట్లాడుతూ ‘‘మా వినియోగదారుల అవసరాలను తీర్చేలా మా ప్రయత్నాలు ఉంటాయి. వారికి మెరుగైన ఉత్పత్తులను, మరింత లాభాలను అందించడమే మా లక్ష్యం. ఆ దిశగా మేం వేసిన మరో అడుగు ఏవీటీఆర్‌ 4120 ట్రక్కు’’ అని పేర్కొన్నారు. 

ఈ ట్రక్కులో 12.5టన్‌ డ్యూయల్‌ టైర్‌ లిఫ్ట్‌ యాక్సిల్‌ను అమర్చారు. దీనిపై కంపెనీకి పేటెంట్‌ కూడా ఉంది. ఇది టైర్ల జీవితకాలాన్ని పెంచుతుంది. దీనిలో 200హెచ్‌పీ ఇంజిన్‌ను అమర్చారు. ఇప్పుడు ఈ సృజనాత్మకమైన ట్రక్కు కస్టమర్లకు మరింత సౌలభ్యతను అందిస్తుందని కంపెనీ సీవోవో అంజూ కథూరియా పేర్కొన్నారు. ట్రక్కులో చాలా ఆప్షన్లు ఉన్నాయని వెల్లడించారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts