
Ather Energy: ఏటా 4లక్షల విద్యుత్తు వాహనాల తయారీకి ఏథర్ ఏర్పాట్లు!
ముంబయి: హీరో మోటోకార్ప్ మద్దతు ఉన్న విద్యుత్తు ద్విచక్రవాహన తయారీ సంస్థ ‘ఏథర్ ఎనర్జీ’ రెండో తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు యోచిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం తమిళనాడులోని హోసూరులో ఉన్న తయారీ కేంద్రం దగ్గరే మరొకటి నిర్మించాలనుకుంటున్నట్లు తెలిపింది. దీంతో ప్రస్తుతం ఉన్న 1.2 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యం నాలుగు లక్షలకు పెరగనున్నట్లు పేర్కొంది. తమ సంస్థ నుంచి వస్తోన్న 450 ఎక్స్, 450 ప్లస్ విద్యుత్తు ద్విచక్రవాహనాలకు భారీ గిరాకీ ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
విద్యుత్తు వాహనాలతో పాటు లిథియం-అయాన్ బ్యాటరీల తయారీపై కూడా కొత్త తయారీ కేంద్రంలో దృష్టి సారించనున్నట్లు తెలిపింది. 2022లో ఈ కేంద్రం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. అదే జరిగితే వచ్చే ఏడాది నాటికి భారత్‌లో అతిపెద్ద విద్యుత్తు వాహనాల తయారీ సంస్థ ఏథర్ నిలుస్తుందని తెలిపింది. అక్టోబరులో ఏథర్ ఎనర్జీ విక్రయాలు 12 రెట్లు పెరిగిన విషయం తెలిసిందే. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు వచ్చే ఐదేళ్లలో రూ.650 కోట్లు పెట్టుబడిగా పెట్టాలని ఏథర్ ఎనర్జీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.