Audi Q5: రూ.2 లక్షలతో ఆడీ క్యూ5ని బుక్‌ చేసుకోవచ్చు!

వచ్చే నెల విడుదల కానున్న ఆడీ క్యూ5 కార్ల బుకింగులు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఎక్కడైనా ఆడీ డీలర్‌షిప్‌లలో రూ.రెండు లక్షలు చెల్లించి కారును బుక్‌ చేసుకోవచ్చు....

Published : 19 Oct 2021 11:32 IST

నేటి నుంచి ప్రారంభం

దిల్లీ: వచ్చే నెలలో విడుదల కానున్న ‘ఆడీ క్యూ5’ కార్ల బుకింగులు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఎక్కడైనా ఆడీ డీలర్‌షిప్‌లలో రూ.రెండు లక్షలు చెల్లించి కారును బుక్‌ చేసుకోవచ్చు. రెండు లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌తో వస్తున్న ఈ కారు 370 ఎన్‌ఎం టార్క్‌ వద్ద 249 హెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. వెనుకభాగంలో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు సహా మొత్తం 8 ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చారు. ఆడీ పార్క్‌ అసిస్ట్‌, కంఫర్ట్‌ కీ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. సరికొత్త క్యూ5 ఎస్‌యూవీని విడుదల చేయనున్న ఆడీ.. భారత్‌లో విక్రయాలను పెంచేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. వాహనాలు బీఎస్‌-6లోకి మారిన సందర్భంగా గత ఏడాది క్యూ3, క్యూ7 సహా పాత క్యూ5 కార్ల విక్రయాలను నిలిపివేసింది. గత ఏడాది ఆడీ 1,639 యూనిట్లను విక్రయించింది. ఈ ఏడాది తొలి ఎనిమిది నెలల విక్రయాల్లో 115 శాతం వృద్ధి నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని