Import duty : విద్యుత్తు కార్లపై దిగుమతి సుంకం తగ్గించాలి: ఆడీ

భారత్‌లో విద్యుత్తు వాహనాలపై దిగుమంతి సుంకాన్ని తగ్గించాలని జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడీ కోరింది....

Published : 26 Sep 2021 18:04 IST

దిల్లీ: భారత్‌లో విద్యుత్తు వాహనాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడి కోరింది. దేశంలో విద్యుత్తు వాహన విపణి వృద్ధికి సుంకాలు అడ్డంకిగా మారాయని తెలిపింది. సుంకాల్ని తగ్గిస్తే భారత్‌లో కార్ల తయారీపై పెట్టుబడి పెట్టేందుకు తమ యాజమాన్యాన్ని ఒప్పించేందుకు అవకాశం ఉంటుందని ఆడి ఇండియా తెలిపింది.

ఆడి ప్రస్తుతం భారత్‌లో ఐదు మోడళ్ల విద్యుత్తు కార్లను విక్రయిస్తోంది. వీటిపై దిగుమతి సుంకం తగ్గిస్తే ధరలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆడి ఇండియా హెడ్‌ బల్బీర్‌ సింగ్‌ ధిల్లాన్ పేర్కొన్నారు. తద్వారా విక్రయాలు పెరుగుతాయన్నారు. తొలి విడతలో భాగంగా ఇటీవల భారత్‌కు తీసుకొచ్చిన ఆడి ఈట్రాన్‌ కార్లను పూర్తిగా విక్రయించామని తెలిపారు. భారత్‌లో వినియోగదారులు విద్యుత్తు కార్లపై ఆసక్తిగా ఉన్నారనడానికి ఇదే నిదర్శనమన్నారు. కనీసం 3-5 ఏళ్ల పాటైనా దిగుమతి సుంకాల్ని తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం పూర్తి స్థాయిలో తయారైన కార్లను దిగుమతి చేసుకుంటే 60 నుంచి 100 శాతం సుంకం విధిస్తున్నారు. ఇంజిన్‌ సైజు, ధర, ఇన్సూరెన్స్‌ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని సుంకం విధిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు