Lockdown Effect: ఖాతాల్లో సొమ్ము లేదు!

ఈఎంఐ, బిల్లుల చెల్లింపు వంటి ఆర్థిక వ్యవహారాల్లో వినియోగించే ఆటో-డెబిట్‌ లావాదేవీల తిరస్కరణ రేటు వరుసగా రెండో నెలా పెరిగింది. లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థపై ఏర్పడ్డ ఒత్తిడిని ఇది సూచిస్తోంద......

Published : 09 Jun 2021 17:14 IST

పెరిగిన ఆటో డెబిట్‌ లావాదేవీల తిరస్కరణ

ముంబయి: ఈఎంఐ, బిల్లుల చెల్లింపు వంటి ఆర్థిక వ్యవహారాల్లో వినియోగించే ఆటో-డెబిట్‌ లావాదేవీల తిరస్కరణ రేటు వరుసగా రెండో నెలా పెరిగింది. లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థపై ఏర్పడ్డ ఒత్తిడిని ఇది సూచిస్తోంది. నేషనల్‌ ఆటోమేటెడ్‌ క్లియరింగ్‌ హౌస్‌(నాచ్‌) వివరాల ప్రకారం.. మే నెలలో మొత్తం 85.7 మిలియన్ ఆటో డెబిట్‌ లావాదేవీల్లో.. 30.8 మిలియన్(35.91 శాతం) లావాదేవీలు తిరస్కరణకు గురయ్యాయి. ఏప్రిల్‌లో 85.4 మిలియన్‌ లావాదేవీల్లో 29.08 మిలియన్(34.05శాతం) తిరస్కరణకు లోనయ్యాయి. మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చిన తిరస్కరణలు మార్చిలో కరోనా మునుపటి స్థితికి చేరుకున్నాయి. కానీ, రెండో దశ విజృంభణ, దాని కట్టడి కోసం రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధించడంతో మళ్లీ ప్రతికూల తిరస్కరణ రేట్లు పెరిగాయి. 

ఆటో డెబిట్‌ లావాదేవీల తిరస్కరణకు అనేక కారణాలు ఉన్నాయి. అయితే, కరోనా కట్టడి కోసం విధించిన కఠిన ఆంక్షలు, లాక్‌డౌన్ వంటి అంశాలు ప్రజల ఆదాయాలకు గండికొట్టడం తిరస్కరణకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీంతో వారు ఖాతాల్లో సరిపడా సొమ్ము ఉంచలేకపోతున్నారు. గత ఏడాది కరోనా విజృంభణ సమయంలోనే తిరస్కరణలు భారీ స్థాయికి చేరగా.. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొంది. ప్రజలు ఉపాధి, ఉద్యోగాలు కోల్పోవడంతో సరైన సమయంలో ఈఎంఐలు, ఇతర ఆర్థికపరమైన వ్యయాల్ని చెల్లించలేకపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని