ఆటో రైడూ ఇక భారం.. ఇ-కామర్స్‌ బుకింగ్‌పై 5 శాతం జీఎస్టీ!

ఆటో ప్రయాణం కూడా ఇకపై భారం కానుంది. ఇ-కామర్స్‌ వెబ్‌సైట్ల ద్వారా ఆటో రిక్షా సేవలను వినియోగించుకుంటే ఇకపై 5 శాతం జీఎస్టీ చెల్లించాలి.

Updated : 26 Nov 2021 19:55 IST

దిల్లీ: ఆటో ప్రయాణం కూడా ఇకపై భారం కానుంది. ఇ-కామర్స్‌ వెబ్‌సైట్ల ద్వారా ఆటో రిక్షా సేవలను వినియోగించుకుంటే ఇకపై 5 శాతం జీఎస్టీ చెల్లించాలి. కొత్త నిబంధన 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం నవంబర్‌ 18న ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇ-కామర్స్‌ వేదికల ద్వారా ఆటో బుకింగులపై జీఎస్టీ మినహాయింపును ఉపసంహరించుకుంటున్నట్లు అందులో పేర్కొంది.

అదే సమయంలో ఆఫ్‌లైన్‌, మాన్యువల్‌గా ఆటో డ్రైవర్లు అందించే సేవలకు మినహాయింపు ఉంటుంది. ఉబర్‌, ఓలా వంటివి ఇ-కామర్స్‌ పరిధిలోకే వస్తాయి. ఇప్పటి వరకు వీటి ద్వారా చేసే ఆటో రిక్షా బుకింగ్‌కు జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆన్‌లైన్‌లో ఆటో బుక్‌ చేసుకునే వారికి పన్ను భారం పడనుంది. అదే సమయంలో ఆఫ్‌లైన్‌లో ఆటో మాట్లాడుకుని వెళ్లేవారికి పన్ను మినహాయింపు ఉండడం వల్ల ఛార్జీలో వ్యత్యాసం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని