డిజిటల్‌ కరెన్సీలకు బీఐఎస్‌ మద్దతు

కేంద్ర బ్యాంకులు తీసుకొచ్చే డిజిటల్‌ కరెన్సీలు ద్రవ్యలభ్యతను, ఏకత్వాన్ని తీసుకొస్తాయని సింగపూర్‌ కేంద్రంగా పనిచేసే బ్యాంక్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌

Published : 24 Jun 2021 00:56 IST

దిల్లీ: కేంద్ర బ్యాంకులు తీసుకొచ్చే డిజిటల్‌ కరెన్సీలు ద్రవ్యలభ్యతను, ఏకత్వాన్ని తీసుకొస్తాయని సింగపూర్‌ కేంద్రంగా పనిచేసే బ్యాంక్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్‌మెంట్స్‌(బీఐఎస్‌) పేర్కొంది. అన్ని కేంద్ర బ్యాంకులకు కేంద్ర బ్యాంకుగా పిలిచే ఈ బీఐఎస్‌ నుంచి డిజిటల్‌ కరెన్సీలకు మద్దతు రావడంతో ప్రస్తుతం భారత్‌తో పాటు ఆ దిశగా అడుగులు వేస్తున్న పలు దేశాలకు బలం చేకూరినట్లయింది. సాంకేతికతంగా అత్యాధునిక నగదును తీసుకొచ్చేందుకు కేంద్ర బ్యాంకు డిజిటల్‌ కరెన్సీలు(సీబీడీసీలు) అవకాశాన్ని ఇస్తాయని బీఐఎస్‌ అభిప్రాయపడింది. ఆర్థిక రంగం, చెల్లింపుల వ్యవస్థ వేగంగా మార్పు చెందుతున్న ఈ నేపథ్యంలో కేంద్ర బ్యాంకులు సైతం ఆ దిశగా అడుగులు వేయాలని పేర్కొంది. సరిహద్దులను దాటి సమర్థంగా చెల్లింపులు జరపడానికి అంతర్జాతీయ సహకారం చాలా కీలకమని  వ్యాఖ్యానించింది. సీబీడీసీల రూపకల్పన విషయంలో ఈ తరహా సహకారం వల్ల కేంద్ర బ్యాంకులకు విదేశీ కరెన్సీ ప్రత్యామ్నాయాలను సృష్టించడానికి కొత్త దారులు కనిపిస్తాయని పేర్కొంది. చైనాతో పాటు పలు దేశాలు సీబీడీసీలపై గట్టిగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఆర్‌బీఐ కూడా డిజిటల్‌ కరెన్సీని తీసుకురావాలని భావిస్తోన్న విషయం విదితమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని