వ‌న్‌కార్డ్ భాగ‌స్వామ్యంతో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కొత్త క్రెడిట్ కార్డు

ప్ర‌ముఖ ప్ర‌భుత్వ రంగ బ్యాంక్‌ బ్యాంక్ ఆఫ్ బ‌రోడా (బీఓబీ) అనుబంధ సంస్థ అయిన బీఓబీ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్‌ (బీఎఫ్ఎస్ఎల్‌) వ‌న్‌కార్డ్‌తో క‌లిసి కో-బ్రాండెడ్ మొబైల్‌-ఫ‌స్ట్ క్రెడిట్ కార్డుల‌ను జారీచేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

Updated : 25 Nov 2021 15:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్ర‌ముఖ ప్ర‌భుత్వ రంగ బ్యాంక్‌ బ్యాంక్ ఆఫ్ బ‌రోడా (బీఓబీ) అనుబంధ సంస్థ అయిన బీఓబీ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్‌ (బీఎఫ్ఎస్ఎల్‌) వ‌న్‌కార్డ్‌తో క‌లిసి కో-బ్రాండెడ్ మొబైల్‌-ఫ‌స్ట్ క్రెడిట్ కార్డుల‌ను జారీచేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ముఖ్యంగా యువ‌త, అలాగే సాంకేతిక ప‌రిజ్ఞానం ఉన్న‌ వినియోగ‌దారుల కోసం ఈ కార్డుల‌ను అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు తెలిపింది. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాకి సంబంధించి క్రెడిట్ కార్డుల జారీ, నిర్వ‌హ‌ణ వ్య‌వ‌హారాల‌ను బీఎఫ్ఎ‌స్‌ఎల్‌ చూస్తుంది. ఈ వన్‌కార్డ్‌జ్ఞ అంత‌ర్జాతీయంగా చెల్లుబాట‌య్యే క్రెడిట్ కార్డ్‌. ఈ క్రెడిట్ కార్డ్‌తో వినియోగ‌దారునికి డిజిట‌ల్ చెల్లింపులు సుల‌భ‌త‌రం కావ‌డంతో పాటు, త‌గిన‌ ర‌క్ష‌ణ‌, నియంత్ర‌ణ‌ కూడా లభిస్తుంది.

మొబైల్ యాప్ ఆధారిత వ‌న్‌కార్డ్‌..  దాని వినియోగ‌దారుల‌కు క్రెడిట్ కార్డుపై పూర్తి నియంత్ర‌ణ ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటుంది. ఖ‌ర్చులు, రివార్డ్ పాయింట్లు, ప‌రిమితులు, చెల్లింపులు మ‌రెన్నో ఎండ్‌-టు-ఎండ్ డిజిట‌ల్ సౌక‌ర్యాల‌ను అందిస్తుంది. బీఓబీ ఫైనాన్షియ‌ల్ సొల్యూష‌న్స్ లిమిటెడ్ చీఫ్ మాట్లాడుతూ కంపెనీ ప్ర‌స్తుతం బ్యాంక్ ఆఫ్ బ‌రోడా బ్రాండ్ కింద వినియోగ‌దారుల‌కు సేవ‌లు పార‌ద‌ర్శ‌కంగా ఉండేందుకు, అత్యుత్త‌మ క్రెడిట్ కార్డులను అందించేందుకు సాంకేతిక ప‌రిజ్ఞానంపై ఎక్కువ పెట్టుబ‌డుల‌ను పెడుతోందన్నారు. బీఎఫ్ఎస్ఎల్‌ క్రెడిట్ కార్డుల వ్యాపారాన్ని నిర్వ‌హించ‌డానికి 1994లో బీఓబీ కార్డ్స్‌ను బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా స్థాపించింది.

Read latest Business News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని