Baleno: 10 లక్షల మైలురాయిని దాటిన బాలినో..!

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ వాహనం బాలినో మరో కీలక మైలురాయిని దాటింది. ఆ కారు విక్రయాలు 10లక్షల మైలు రాయిని

Updated : 09 Dec 2021 16:12 IST

ఇంటటర్నెడెస్క్‌: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ వాహనం బాలినో మరో కీలక మైలురాయిని దాటింది. ఆ కారు విక్రయాలు 10లక్షల మైలు రాయిని దాటినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ మోడల్‌ను తొలిసారిగా 2015 అక్టోబర్‌లో మార్కెట్లోకి విడుదల చేశారు. దీనిని కంపెనీ ప్రీమియం రిటైల్‌ విక్రయ కేంద్రాలైన నెక్సాలో అందుబాటులోకి తెచ్చారు. ఈ మోడల్‌ 2018 నాటికి ఈ కారు విక్రయాలు 5 లక్షలు దాటేశాయి. ఆ తర్వాత ఐదులక్షల విక్రయాలను మూడేళ్లలోనే పూర్తి చేసుకోవడం విశేషం. 

ఈ సందర్భంగా మారుతీ సుజుకీ సీనియర్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్ శశాంక్‌ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. బాలినో మార్కెట్లోకి విడుదలైనప్పటి నుంచి ప్రీమియం హ్యాచ్‌బాక్‌లో విభాగంలో మార్కెట్‌ లీడర్‌గా నిలిచింది. ప్రస్తుతం 25శాతం మార్కెట్‌ దూసుకెళుతోందని పేర్కొన్నారు. ‘‘మారుతున్న పట్టణ యువత అభిరుచులకు సరైన ఎంపికగా బాలినో ఉంది’’ అని పేర్కొన్నారు. బాలినోలో 1.2 లీటర్‌ ఇంజిన్‌ అమర్చారు. ఇది వినియోగదారులకు సుజుకీ స్మార్ట్‌ హైబ్రీడ్‌ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం 248 నగరాల్లో 344 ఔట్‌లెట్లలో దీనిని విక్రయిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని