బ్యాంకు లాకర్లు
బ్యాంకులు అనుబంధ సేవల్లో భాగంగా సురక్షిత డిపాజిట్ లాకర్ల సదుపాయాన్ని వినియోగదారులకు అందిస్తున్నాయి. బ్యాంకు వినియోగదారులు తమ విలువైన నగదు, బంగారం, పత్రాలను సురక్షితమైన లాకర్లలో భద్రపర్చుకునేందుకు వీలుంది. వీటి నిర్వహణకు ఛార్జీలు/ అద్దె వసూలు చేస్తారు..
బ్యాంకులు అనుబంధ సేవల్లో భాగంగా సురక్షిత డిపాజిట్ లాకర్ల సదుపాయాన్ని వినియోగదారులకు అందిస్తున్నాయి. బ్యాంకు వినియోగదారులు తమ విలువైన నగదు, బంగారం, పత్రాలను సురక్షితమైన లాకర్లలో భద్రపర్చుకునేందుకు వీలుంది. వీటి నిర్వహణకు ఛార్జీలు/ అద్దె వసూలు చేస్తారు.
లాకర్లు పొందేందుకు అర్హులైన వారు
- లాకరు సదుపాయాన్ని మైనర్లకు కల్పించరు
లాకర్‌ను నామినీని నియమించాలనుకుంటే మేజర్ పేరిటే చేయించాల్సి ఉంటుంది. బ్యాంకుల్లో చిన్న, మధ్య, పెద్ద, అతి పెద్ద లాకర్లు ఉంటాయి. వీటిలో మన అవసరానికి తగినదాన్ని ఎంచుకోవచ్చు. లాకర్‌ను నిర్వహించుకునేందుకు కనీసం ఏడాది గడువుంటుంది. గ్రామీణ, పట్టణ, నగర, మెట్రో ప్రాంతంలో ఉన్న శాఖలకు వివిధ రకాల ఛార్జీలు ఉంటాయి. లాకర్‌కు చెల్లించే అద్దెను ముందుగానే వసూలుచేస్తారు. కొన్ని బ్యాంకులు రెండు మూడేళ్ల అద్దెను ముందుగా చెల్లించినట్టయితే కొంత రాయితీ ఇస్తాయి. వార్షిక అద్దెను తీర్చేలా బ్యాంకులు పొదుపు, కరెంటు ఖాతాలకు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ జారీచేస్తాయి. కట్టాల్సిన అద్దె గడువు మించిపోతే బ్యాంకులకు లాకర్లను తెరిచే హక్కు ఉంటుంది. ఏదైనా లాకరును ఏడాది పాటు ఒక్కసారి కూడా తెరవకుండా ఉంటే బ్యాంకులు యజమానికి నోటీసులు జారీచేస్తాయి.
భారతీయ రిజర్వు బ్యాంకు నియమనిబంధనల ప్రకారం ఏవైనా లాకర్లను 1 నుంచి3ఏళ్ల దాకా తెరవకుండా ఉంచినట్టయితే బ్యాంకులు సదరు లాకర్ యజమానికి నోటీసులు అందిస్తాయి. లాకర్లను నిర్వహించడమో లేదా స్వాధీనం చేయాల్సిందిగా బ్యాంకులు వారికి సూచిస్తాయి. అద్దెను క్రమంగా చెల్లిస్తున్నా లాకర్లను తప్పక తెరిచి చూసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ లాకర్ యజమానులు స్పందించకపోతే వారికి నోటీసు ఇచ్చాక పోలీసుల సహకారంతో బ్యాంకు అధికారులు లాకర్లను తెరుస్తారు.
సురక్షిత డిపాజిట్ లాకర్‌ను పొందేందుకు పాటించాల్సిన పద్ధతి
- బ్యాంకులు లాకర్‌ను అద్దెకు ఇచ్చే ముందు ‘మీ ఖాతాదారు తెలుసుకోండి ’ (కేవైసీ) నిబంధనలు పాటిస్తాయి. ప్రస్తుత ఖాతాదారులకే బ్యాంకులు లాకర్లను ఇస్తాయి కాబట్టి కేవైసీ సమస్య తలెత్తే అవకాశం తక్కువ.
- లాకర్ సదుపాయాన్ని పొందడం ‘అద్దె’తో కూడుకున్నది కాబట్టి ‘ఒప్పందం’ రాయాల్సి ఉంటుంది. ఒప్పందంలో లాకర్ తీసుకున్నందుకు పాటించాల్సిన నియమనిబంధనలు పొందుపరుస్తారు. ఈ ఒప్పందానికి స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి వస్తుంది.
- నమూనా గుర్తింపు పత్రంలో లాకర్ తీసుకునే వ్యక్తి పేరు, చిరునామా, సంప్రదించాల్సి నంబరు నమోదు చేయాల్సి ఉంటుంది. లాకర్‌ను ఉమ్మడిగా తీసుకోవాలనుకుంటే వాళ్లల్లో ఎవరు లాకర్‌ను నిర్వహించాలో స్పష్టంగా పేర్కొనాలి. ఒక్కరుగా నిర్వహిస్తారా ఉమ్మడిగా నిర్వహించుకుంటారా అనేది ముందుగానే బ్యాంకులకు తెలియజేయాలి.
- పైన పేర్కొన్న నిబంధనల ప్రకారం సురక్షిత డిపాజిట్ ఖాతాను కేటాయిస్తారు. లాకర్‌ను రెండు తాళం చెవులతో తెరవాల్సి ఉంటుంది. ఒకటి కస్టోడియన్ (బ్యాంకర్) తాళంచెవి. మరొకటి లాకర్‌ను అద్దె తీసుకున్న వ్యక్తికి ఇచ్చే తాళంచెవి. ఇదే కాకుండా లాకర్ యజమాని తన అభీష్టం మేరకు మరో తాళాన్ని తన సొంత ఖర్చులతో ఏర్పాటుచేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!